తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'OBCల మధ్య కాంగ్రెస్-జేఎమ్ఎమ్ కూటమి చిచ్చు పెడుతోంది! ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం' - PM MODI SLAMS CONGRESS JMM

ఓబీసీలను ఒకరిపైకి ఒకరిని కాంగ్రెస్- జేఎమ్​ఎమ్​ కూటమి ఉసిగొల్పుతోందన్న ప్రధాని నరేంద్ర మోదీ- ఐక్యంగా ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటామని హెచ్చరిక- అంబేడ్కర్​కు తన నివాళి అదే అన్న మోదీ

PM MODI Slams Congress JMM
PM MODI Slams Congress JMM (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 3:41 PM IST

PM MODI Slams Congress JMM :కాంగ్రెస్-జేఎమ్ఎమ్ కూటమి​ ఓబీసీలను ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఝార్ఖండ్​లోని బొకారోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

'SC, ST, OBSలకు కాంగ్రెస్-జేఎమ్ఎమ్ వ్యతిరేకం'​
"కాంగ్రెస్-జేఎమ్ఎమ్ కుట్రల పట్ల జాగ్రత్త వహించండి. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వారు ఎంతకైనా దిగజారవచ్చు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీల ఐక్యతకు కాంగ్రెస్‌ వ్యతిరేకం. ఐక్యత లేని వరకు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూనే ఉంది. దేశాన్ని దోచుకుంది. చోటానాగ్​పుర్ ప్రాంతంలో 125పైగా ఉపకులాలను ఓబీసీలుగా పరిగణిస్తున్నారు. వారిని ఒకరిపైకి మరోకరిని(ఉపకులాలను) ఉసిగొల్పి కాంగ్రెస్-జేఎమ్ఎమ్ వారి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి. అందకే ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని హెచ్చరిస్తున్నాను" అని మోదీ అన్నారు.

అంబేడ్కర్​కు నేను ఇచ్చే నివాళి అదే: ప్రధాని మోదీ
ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతున్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. "కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు జమ్ముకశ్మీర్​ అధికరణ 370ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాయి. దాని ద్వారా మన సైనికులు మళ్లీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
(అందుకే) ఆర్టికల్ 370ని మోదీ పాతరేశారు. ఏడు దశాబ్దాలుగా అక్కడ అంబేడ్కర్ రాజ్యాంగం అమలులో లేదు. మొదటిసారి భారత రాజ్యాంగంపై జమ్ముకశ్మీర్​ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది నేను అంబేడ్కర్​ ఇచ్చే నివాళి. చొరబాటుదారులను తరిమికొట్టేందుకు, అవినీతి నిర్మూలనకు ఝార్ఖండ్​లో బీజేపీ నేతృత్వంలోన ప్రభుత్వం అవసరం. మీరు(ఝార్ఖండ్​ ప్రజలనుద్దేశించి) పిడికెడు ఇసుక కోసం ఆరాటపడుతున్నారు. కానీ వారు దాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. (మేము గెలిస్తే) జేఎమ్ఎమ్​ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సృష్టించిన రిక్రూట్‌మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపుతాం. యువత భవిష్యత్తుతో ఆడుకున్న వారిని వదిలిపెట్టం" అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఝార్ఖండ్​లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 13, 20 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్​ 23న ఓట్ల కౌంటింగ్ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details