You Can Travel in Sleeper Class with a General Ticket :డబ్బు ఆదా మొదలు పలు కారణాలతో.. రైలు ప్రయాణానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా.. పేద, మధ్య తరగతి ప్రయాణికులు ట్రైన్(Train)రవాణాకు మొగ్గు చూపుతుంటారు. అయితే.. జనాల ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ట్రైన్లో జనరల్, స్లీపర్, ఏసీ కేటగిరీల్లో సీట్లు ఉంటాయని తెలిసిందే.
చాలా మంది జనరల్ టికెట్ తీసుకుని జర్నీ చేస్తుంటారు. కానీ.. కొన్ని అత్యవసర పరిస్థితుల్లోనో, జనరల్ బోగీల్లో ప్లేస్ లేకనో కొందరు జనరల్ టికెట్ తీసుకొని.. స్లీపర్ క్లాస్ బోగీలో ప్రయాణిస్తుంటారు. ఆ టైమ్‌లో చెకింగ్‌కి వచ్చిన టీటీఈ ఫైన్ వేస్తారు. అయితే.. చాలా మందికి తెలియని విషయమేమిటంటే కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఫైన్ తప్పించుకోవచ్చు. అంతేకాదు.. జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వే చట్టాల్లోని కొన్ని నిబంధనలు తెలుసుకుంటే.. మీరు జనరల్ టికెట్ తీసుకొని అనుకోకుండా స్లీపర్ క్లాస్ బోగీ ఎక్కినా ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. రైల్వే రూల్స్ 1989 ప్రకారం.. మీ ప్రయాణ దూరం 199 కిలో మీటర్ల లోపు ఉంటే.. మీరు తీసుకున్న జనరల్ టికెట్ చెల్లుబాటు సమయం 3 గంటలు. ఇప్పుడు మీరు జనరల్ టికెట్ తీసుకొని మీ ట్రైన్ కోసం వేచి ఉన్నారనుకోండి. గంటలు గడుస్తున్నా మీ ట్రైన్ రాకపోతే.. అప్పుడు మీరు స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించవచ్చట.