How To Store Curry Leaves: మనం డైలీ చేసుకునే వివిధ వంటకాల్లో తప్పనిసరిగా ఉండే వాటిల్లో ఒకటి.. కరివేపాకు. ఇది వంటలకు కమ్మని రుచి, వాసనను అందించి అదనపు టేస్ట్‌ను తీసుకొస్తుంది. మనకు విరివిగా దొరికే ఈ ఆకులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే కరివేపాకులో.. ఫైబర్, పిండి పదార్థాలు, విటమిన్ ఎ, బి, సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, భాస్వరం, కాల్షియం వంటి శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా పుష్కలం. ఫలితంగా దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
అయితే, అసలు సమస్య వచ్చేసరికి.. కరివేపాకును మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఫ్రెష్‌గానే ఉంటుంది. కానీ, నెక్ట్ డే వచ్చేసరికి అది కాస్త వాడిపోయినట్లు కనిపిస్తుంది. దాంతో చాలా మంది కరివేపాకు(Curry Leaves)వాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసం కొన్ని ఈజీ టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న కరివేపాకు వాడిపోకుండా.. చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న కరివేపాకును శుభ్రంగా కడిగి జల్లెడలో వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆకుల మీద ఉన్న వాటర్ పోతుంది. ఆపై ఒక కాటన్ పొడి క్లాత్ తీసుకొని ఆ ఆకులను దానిపై ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఆకులలో ఇంకేమైనా తేమ ఉంటే తొలగిపోయి పొడిగా మారతాయి.
- ఇందుకోసం 2 నుంచి 3 గంటల సమయం పట్టవచ్చు. ఇలా కరివేపాకు ఆకులు పొడిగా మారాయనుకున్నాక.. ఒక గాలి చొరబడని డబ్బా తీసుకొని లోపల కొంత టిష్యూ పెట్టి ఆపై అందులో వాటిని వేసుకొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కరివేపాకు త్వరగా వాడిపోకుండా, కుళ్లిపోకుండా ఉండి.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందంటున్నారు నిపుణులు.