Congress Kisan Nyay Guarantee :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైతులపై కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. కిసాన్ న్యాయ్ పేరిట 5 గ్యారంటీలను ప్రకటించింది. దేశంలో పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపింది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ ఎత్తివేస్తామని వెల్లడించింది. రైతుల పంట బీమా సొమ్ము 30 రోజుల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఐదు కిసాన్ గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఐదు హామీలేంటంటే?
- పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
- వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ ఎత్తివేత
- రైతుల కోసం శాశ్వత రుణమాఫీ కమిషన్
- పంట బీమా సొమ్ము 30 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ
- రైతుల కోసం కొత్త ఎగుమతి, దిగుమతి విధానం
అంతకుముందు బుధవారం మహిళలపై కాంగ్రెస్ పార్టీ హామీల జల్లు కురిపించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలోని పేద కుటుంబంలోని ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో 'నారీ న్యాయ్' పేరిట మహిళలకు ఐదు గ్యారెంటీలను ప్రకటించింది హస్తం పార్టీ. అవేంటంటే?
మహాలక్ష్మి: ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష నగదు నేరుగా వారి ఖాతాలోకి బదిలీ