తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆహా అనిపించే "తమిళనాడు వెడ్డింగ్​ స్టైల్ కొబ్బరన్నం"- నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ అద్భుతం! - Coconut Rice Recipe

Tamilnadu Style Coconut Rice Recipe : పచ్చి కొబ్బరితో చాలా మంది లడ్డూలు, పచ్చడి, పాయసం.. అంటూ రకరకలా వెరైటీలు చేసుకుని తింటుంటారు. అయితే ఇవే కాకుండా.. ఎప్పుడైనా పచ్చికొబ్బరితో పసందైన కొబ్బరి అన్నం ట్రై చేశారా? లేదు అంటే.. ఈరోజే తమిళనాడు వెడ్డింగ్ స్టైల్​లో కొబ్బరి అన్నం ప్రిపేర్​ చేసుకోండి. రుచి అద్భుతంగా ఉంటుంది!

How To Make Coconut Rice Recipe
Tamilnadu Style Coconut Rice Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 5:05 PM IST

How To Make Tamilnadu Wedding Style Coconut Rice : పచ్చి కొబ్బరి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది పచ్చి కొబ్బరిని తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. కొబ్బరితో లడ్డూలు, పాయసం, చట్నీ వంటి చేసుకొని తింటుంటారు. అయితే ఇవి మాత్రమే కాకుండా.. ఎప్పుడైనా పచ్చి కొబ్బరితో కొబ్బరన్నం ట్రై చేశారా? లేదు అంటే మాత్రం.. మీరు తమిళనాడు వెడ్డింగ్​ స్టైల్ కొబ్బరి అన్నాన్ని ఓసారి ప్రయత్నించాల్సిందే. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుంది! దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతకీ, కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొబ్బరి అన్నం తయారీకి కావాల్సినవి :

  • అన్నం - 1 కప్పు
  • కొబ్బరినూనె - 3 టేబుల్ ​స్పూన్లు
  • తాజా పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
  • మినపప్పు - 1 టేబుల్ స్పూన్
  • దాల్చిన చెక్క - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - చిటికెడు
  • ఎండు మిర్చి - 3
  • జీడిపప్పు పలుకులు -15 నుంచి 20
  • కిస్మిస్ - 15
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పచ్చి మిర్చి - 2
  • ఉల్లిపాయ -1
  • అల్లం తరుగు - కొద్దిగా
  • కొత్తిమీర - కొద్దిగా

డైలీ చిన్న ఎండు కొబ్బరి ముక్క తినండి - క్యాన్సర్, గుండె జబ్బులే కాదు ఈ సమస్యలూ మీ దరిచేరవు!

తమిళనాడు స్టైల్ కొబ్బరి అన్నం తయారీ విధానం :

  • కొబ్బరి అన్నం కోసం ముందుగా ఒక కప్పు బియ్యంలో కొద్దిగా ఉప్పు వేసి పొడి పొడిగా వండుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె పోసుకోవాలి. కొబ్బరి నూనె ఇంట్రస్ట్​ లేని వాళ్లు రెగ్యులర్​ వాడే నూనె ఉపయోగించవచ్చు. మంట హై ఫ్లేమ్​లో ఉంచి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి.
  • నూనె బాగా వేడెక్కాక అప్పుడు ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఆపై దాల్చినచెక్క, ఇంగువ, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
  • అలాగే వేగుతున్న మిశ్రమంలోనే జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్నాక అందులో ముందుగా సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలకలు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమంలో కొబ్బరి తురుము వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్​లో ఉంచి కొబ్బరి తురుము ఎర్రగా మారే వరకు వేయించుకోవాలి. అప్పుడే తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది.
  • మిశ్రమం ఆ విధంగా వేగిందనుకున్నాక ముందుగా వండి పెట్టుకున్న రైస్ వేసుకొని వేగంగా టాస్ చేసుకోవాలి.
  • చివరగా కొత్తిమీర, అల్లం తరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై స్టౌ ఆఫ్ చేసుకుని దింపుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే తమిళనాడు స్టైల్ కొబ్బరి అన్నం రెడీ!
  • దీన్ని మీరు ఏదైనా కుర్మాతో లేదంటే డైరెక్ట్​గా తిన్నా టేస్ట్ అద్దిరిపోతుంది అంతే!

కొబ్బరి నూనె ఇలా వాడితే - అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!

ABOUT THE AUTHOR

...view details