Best Tips To Avoid Bad Smell From Clothes :కాలం ఏదైనా సరే దుస్తుల నుంచి చెమట వాసన రావడం అనేది కామన్. కొందరు ఎన్ని పెర్ఫ్యూమ్లు, డియోలు వాడినా బట్టల నుంచి చెమట స్మెల్ వస్తూనే ఉంటుంది. దాంతో నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. వర్షాకాలంలో మరొక విధమైన ముతక వాసన ఇబ్బంది పెడుతుంది. ఈ దుర్వాసన సమస్య రాకుండా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మకాయ : ఇది ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే దుస్తుల నుంచి వచ్చే చెడు వాసనలను తిప్పికొట్టడంలోనూ నిమ్మరసం(Lemon) సమర్థవంతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చెమట వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని చెబుతున్నారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. బట్టలు ఉతికే ముందు బకెట్ వాటర్లో కాస్త నిమ్మరసం కలిపి అందులో కాసేపు దుస్తులను నానబెట్టుకోవాలి. ఆపై వాష్ చేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.
2021లో 'జర్నల్ ఆఫ్ టెక్స్‌టైల్ అండ్ అపారెల్' ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నిమ్మరసం దుస్తుల నుంచి వచ్చే చెమట వాసనను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ ఐ.ఎం. ఖాన్ పాల్గొన్నారు. నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దుస్తువుల నుంచి వచ్చే చెడు వాసనలను తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
వాట్ ఆన్ ఐడియా : షర్ట్ మీద చట్నీ- కుర్తామీద కాఫీ - మరక ఎంత మొండిదైనా మటాషే!