Building Collapse In Burari Delhi :దిల్లీలో కొత్తగా కట్టిన ఓ నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో 8ఏళ్ల బాలిక సహా ఇద్దరు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 12మందిని రక్షించినట్లు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. నగరంలోని బురాడీ ప్రాంతంలో ఉన్న భవనం కూలినట్లు సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 22మంది భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఎంఓ నీరజ్ మీన, ఎంపీ మనోజ్ తివారీ, ఎమ్ఎల్ఏ సంజీవ్ ఝా ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.