తెలంగాణ

telangana

ETV Bharat / bharat

BJP, RSS రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నాయి: రాహుల్ గాంధీ - RAHUL GANDHI FIRES ON BJP

బీజేపీ, ఆర్ఎస్ఎస్​పై రాహుల్ గాంధీ విమర్శలు - ఆ రెండూ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నాయని ఆరోపణ

Rahul Gandhi Fires On BJP
Rahul Gandhi Fires On BJP (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 7:06 PM IST

Rahul Gandhi Fires On BJP :బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రాజ్యాంగాన్ని రక్షిస్తూనే ఉంటాయని తెలిపారు. ప్రేమ, ఐక్యతతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించే ఇండియా కూటమి, ప్రజలను విభజించేవారితో యుద్ధం చేస్తోందని అన్నారు. ఝార్ఖండ్​లోని జంషెడ్​పుర్​లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

'దేశంలో సిద్ధాంతాల మధ్య యుద్ధం'
"జేఎంఎం నేతృత్వంలోని కూటమిని మళ్లీ ఆశీర్వదించండి. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిరంతరం కృషి చేస్తాయి. దేశంలో సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకవైపు ఇండియా కూటమి, మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయి. ఇండియా కూటమి ప్రేమ, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో హింస, కోపం, దురహంకారం, ద్వేషాన్ని పెంచుతాయి. ఝార్ఖండ్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే, ఇండియా బ్లాక్ ప్రతినెలా మహిళల బ్యాంకు ఖాతాలోకి రూ.2,500 బదిలీ చేస్తుంది. బీజేపీ సర్కార్ ప్రస్తుతం బిలియనీర్లకు ఇస్తున్న డబ్బును, ఇకపై మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. దేశానికి మహిళలే వెన్నుముక. కానీ ద్రవ్యోల్బణం కారణంగా వారే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు" అని రాహుల్ గాంధీ అన్నారు.

'రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం'
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లలో ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ తెలిపారు. అలాగే ఝార్ఖండ్​లో ఇండియా కూటమి అధికారంలో వస్తే కులగణన జరిపిస్తామన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 28 శాతానికి, ఎస్సీ రిజర్వేషన్లను 10 నుంచి 12 శాతానికి, ఓబీసీ రిజర్వేషన్లను 24 నుంచి 27 శాతానికి పెంచుతామని పేర్కొన్నారు.

రూ.450కే గ్యాస్ సిలిండర్
"ఝార్ఖండ్​లో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే ప్రతి వ్యక్తికి ప్రతి నెలా ఏడు కిలోల రేషన్ బియ్యం అందిస్తాం. గ్యాస్ సిలిండర్​ను రూ. 450కు ఇస్తాం. రూ.15లక్షల వరకు వర్తించే కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతాం. వరికి క్వింటాల్​కు రూ.3,200 మద్దతు ధరను అందిస్తాం. 10 లక్షల మంది యువతకు ప్రైవేట్‌, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ప్రతి జిల్లాలో 500 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఇండస్ట్రియల్‌ పార్క్​ను ఏర్పాటు చేస్తాం" అని రాహుల్ వ్యాఖ్యానించారు.

దేశంలో బీజేపీ ఉన్నంత వరకు మతపరమైన రిజర్వేషన్లు ఉండవు: అమిత్ షా

'ఆ రాష్ట్రాలన్నీ కాంగ్రెస్‌ ATMలు'- 'రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ప్రజల దృష్టి మళ్లింపు'

ABOUT THE AUTHOR

...view details