తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రం గుడ్​న్యూస్- రూ.29కే కిలో బియ్యం- వచ్చే వారం మార్కెట్​లోకి భారత్ రైస్

Bharat Rice Price : దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ సామాన్య పౌరులకు ఊరట కలిగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారత్‌ రైస్‌ పేరిట కిలో బియ్యం రూ.29కే విక్రయించనుంది. వచ్చే వారం నుంచి ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో భారత్‌ రైస్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. బియ్యం ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా నిల్వలు ఎంత ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని కేంద్రం ఆదేశించింది.

Bharat Rice Price
Bharat Rice Price

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 3:19 PM IST

Bharat Rice Price :దేశవ్యాప్తంగా బియ్యం ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి 'భారత్‌ రైస్' పేరిట కేజీ బియ్యం రూ.29కే విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సామాన్య పౌరులకు ఊరట కలిగిస్తుందని పేర్కొంది. బియ్యం ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా నిల్వలు ఎంత ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని కేంద్రం ఆదేశించింది.

బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా, గత ఏడాది కాలంగా బియ్యం ధరలు 15 శాతం పెరిగాయని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. పెరిగిన ధరల నేపథ్యంలో భారత్‌ రైస్‌ పేరిట రాయితీ ధరకు బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు సహకార సంస్థలు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- (NCCF) సహా రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా భారత్‌ రైస్‌ విక్రయాలను చేపట్టనున్నారు. ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా భారత్‌ రైస్‌ను విక్రయించనున్నారు. వచ్చే వారం నుంచి 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌ల రూపంలో భారత్‌ రైస్‌ అందుబాటులోకి రానుంది. తొలిదశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని రిటైల్‌ మార్కెట్‌ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

ఇప్పటికే 'భారత్‌ అటా' పేరిట గోధుమ పిండిని కిలో 27 రూపాయల 50 పైసలకు కేంద్రం విక్రయిస్తోంది. 'భారత్‌ దాల్‌' పేరిట శెనగ పప్పును కిలో రూ.60కి కేంద్రం విక్రయిస్తోంది. బియ్యం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఇప్పట్లో ఎత్తివేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. దేశీయంగా బియ్యం ధరలు తగ్గేవరకు ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. తమ తమ పోర్టల్‌లలో బియ్యం నిల్వలు ఎన్ని ఉన్నాయో రిటైలర్లు, హోల్‌సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం బహిరంగపర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బియ్యం మినహా ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. బియ్యం నిల్వలపై ఆంక్షలు విధించే అవకాశాలు కూడా తోసిపుచ్చలేమని సంకేతాలు ఇచ్చింది.

రాజకీయాల్లోకి హీరో విజయ్- 2026 ఎన్నికల్లో పోటీ- తమిళ ప్రజలకే అంకితమన్న దళపతి

మాజీ సీఎం అరెస్ట్​పై విచారణకు సుప్రీం నో- హేమంత్ సోరెన్​కు 5రోజుల రిమాండ్

ABOUT THE AUTHOR

...view details