తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పూరీ, కాశీ, అయోధ్యకు వెళ్లాలా? భక్తుల కోసం స్పెషల్ ట్రైన్​- ప్యాకేజీ ఎంతో తెలుసా? - Bharat Gaurav Train Package - BHARAT GAURAV TRAIN PACKAGE

Bharat Gaurav Train 2024 : పూరీ, కాశీ, అయోధ్య వంటి పుణ్య క్షేత్రాలను దర్శించుకోవాలనుకునేవారికి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పుణ్య క్షేత్రాల సందర్శన కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించింది. మొత్తం 12 రోజులపాటు సాగే ఈ యాత్ర ప్యాకేజీ ఎంతో? ఏయే పుణ్య క్షేత్రాలను కవర్ చేస్తుందో? చూద్దాం.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 12:13 PM IST

Bharat Gaurav Train 2024 :దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు, సందర్శనా ప్రదేశాలను చూడాలనుకునేవారికి శుభవార్త. దేశంలో పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు, భారతీయ సంస్కృతిని తెలియజేసేలా రైల్వేశాఖ మరో భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్ రైలును ప్రారంభించింది. ఈ రైలులో ప్రయాణించి మే 17 నుంచి 28 వరకు పూరీ, కాశీ, అయోధ్య వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలు, సందర్శనా ప్రదేశాలు మీదుగా వెళ్లే ఈ టూర్ ప్యాకేజీ ఎంతో? టూర్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.

భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్​సీటీసీ భక్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్​లోని ఉదయ్​పుర్- అయోధ్య మధ్య భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపాలని నిర్ణయించింది. ఉదయపుర్​లో మే 17న ఈ రైలు బయలుదేరి మళ్లీ మే 28న అయోధ్యకు చేరుకుంటుంది. మొత్తం 12 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో పూర్తిగా థర్డ్ ఏసీ రైలు బోగీలు ఉంటాయని ఐఆర్​సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ యోగేంద్ర సింగ్ గుర్జార్ తెలిపారు. అందువల్ల వేసవిలోనూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగదని చెప్పారు.

'ప్రయాణికులకు స్టాండర్డ్ కేటగిరీ, కంఫర్ట్ కేటగిరీ అనే రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ కేటగిరీ ప్యాకేజ్ ధర రూ.26,660. ఇందులో ఏసీ కోచ్​లో ప్రయాణం, నాన్ ఏసీలో వసతి, నాన్ ఏసీ బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. కంఫర్ట్ కేటగిరీ ధర రూ.31,975. ఈ ప్యాకేజ్​లో ఏసీ బోగీలో ప్రయాణం, ఏసీ రూమ్స్​లో వసతి, ఏసీ బస్సుల్లో ప్రయాణం ఉంటుంది' అని యోగేంద్ర సింగ్ గుర్జార్ చెప్పారు.

ఇదే టూర్ షెడ్యూల్

  • మే 17- భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఉదయ్​పుర్​లో బయలుదేరుతుంది. రెండు రోజులు చిత్తోర్‌ గఢ్, భిల్వాఢా, అజ్మేర్, జయపుర మీదుగా పూరీకి ప్రయాణం సాగుతుంది.
  • మే 19- పూరీ చేరుకుంటుంది. అక్కడ కొలువైన జగన్నాథుడిని భక్తులు దర్శించుకుంటారు.
  • మే 20- తర్వాత కోణార్క్​లోని సూర్య దేవాలయాన్ని దర్శించుకుంటారు.
  • మే 21- రైలు కోల్​కతా చేరుకుంటుంది. బస్సు మార్గం ద్వారా భక్తులు గంగాసాగర్​కు చేరుకుంటారు. గంగాసాగర్​ను సందర్శించిన తర్వాత ప్రయాణికులు మే 21వ తేదీ రాత్రి విశ్రాంతి తీసుకుంటారు.
  • మే 22- మళ్లీ గంగాసాగర్ నుంచి ప్రయాణికులు కోల్​కతా చేరుకుంటారు. కాళీఘాట్​ను సందర్శిస్తారు. దర్శనం అనంతరం జస్దిహ్ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు.
  • మే 23- కోల్​కతా నుంచి బిహార్​కు చేరుకునేందుకు రైలులో ప్రయాణిస్తారు.
  • మే 24- బిహార్​లోని గయాకు చేరుకుంటారు. అక్కడ మహాబోధి, విష్ణుపాద్ ఆలయాన్ని దర్శించుకుంటారు.
  • మే 25- రైలు వారణాసికి చేరుకుంటుంది. కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవీ ఆలయాలను దర్శించుకుంటారు. అదే రోజు సాయంత్రం సరయూ నది ఒడ్డున గంగా హారతిని వీక్షిస్తారు.
  • మే 26- రైలు వారణాసి నుంచి బయలుదేరి అయోధ్య చేరుకుంటుంది. అయోధ్యలో కొలువుదీరిన రామయ్యను దర్శించుకుంటారు. హనుమాన్‌ గఢీని సైతం సందర్శిస్తారు.
  • మే 28- మే 26 రాత్రి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అయోధ్య నుంచి బయలుదేరి మే 28న ఉదయపుర్ చేరుకుంటుంది.

ఈ ప్యాకేజ్ కింద మీకు ప్రయాణ, భోజన వసతులు, భక్తులకు ఆలయ దర్శన సౌకర్యాలు కల్పిస్తారు. ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సదుపాయం, ప్రభుత్వ ఉద్యోగులకు భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్​టీసీ) కూడా పొందొచ్చు. 9001094705, 8595930998 ఈ రెండు నంబర్లకు కాల్ చేసి ఈ ప్యాకేజీ గురించి ప్రయాణికులు తెలుసుకోవచ్చు. ఐఆర్​సీటీసీ వెబ్​సైట్‌లో కూడా ప్యాకేజీ గురించి వివరాలు తెలుసుకోవచ్చు.

ట్రైన్ టికెట్ బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్​ అని వచ్చిందా? - ఇలా చేశారంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు! - Waiting List Tickets Confirm Tricks

క్యూలో నిలబడకుండా ట్రైన్ టికెట్​ తీసుకోవాలా? UTS యాప్​లో బుక్ చేసుకోండిలా! - How To Book Unreserved Train Ticket

ABOUT THE AUTHOR

...view details