Best Temperature To Wash Jeans : ఇంట్లో దుస్తులు క్లీన్ చేస్తే సగం పని పూర్తయినట్టుగా ఫీలవుతారు గృహిణులు. అందుకే.. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వాషింగ్ మెషీన్ వాడుతున్నారు. దీనివల్ల మహిళలకు శ్రమ తగ్గడంతోపాటు టైమ్ సేవ్ అవుతుంది. అయితే.. వాషింగ్ మెషీన్ కొన్నప్పుడు కంపెనీ యూజర్ మాన్యువల్ ఇస్తుంది. దాన్ని తప్పకుండా చదవాలి. కానీ.. చాలా మంది లైట్ తీసుకుంటారు.
ఫలితంగా.. వారికి ఏ ఉష్ణోగ్రత వద్ద ఏ రకమైనటువంటి దుస్తులు ఉతకాలో తెలియదు! జీన్స్‌ప్యాంట్ల వంటి మందంపాటి దుస్తులను ఉతికేటప్పుడు టెంపరేచర్ ఎక్కువగా సెట్ చేస్తుంటారు. దీంతో అవి త్వరగా రంగు మారిపోతుంటాయి. మరి.. ఏ ఉష్ణోగ్రత వద్ద ఏ రకమైనటువంటి దుస్తులు ఉతకాలి? వాషింగ్ మెషీన్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాషింగ్ మెషీన్ ఎలా క్లీన్ చేయాలి :
- ఎక్కువ మంది వాషింగ్ మెషీన్ పైన చూడడానికి బాగానే ఉంది కదా.. లోపల కూడా శుభ్రంగానే ఉంటుందని అనుకుంటారు. దీంతో వాషింగ్ మెషీన్‌ను క్లీన్ చేయడం గురించి ఆలోచించరు.
- అయితే.. ఎక్కువ రోజులు వాషింగ్ మెషీన్ శుభ్రం చేయకపోతే.. లోపల దుమ్ము, ధూళి, క్రిములు, బూజు వంటివి పేరుకుపోతాయని నిపుణులంటున్నారు. దీనివల్ల బట్టల మురికిపోవడం అటుంచితే.. వాషింగ్ మెషీన్ తొందరగా పాడైపోతుందని చెబుతున్నారు.
- అందుకే కనీసం 20 రోజులకు ఒకసారి నీళ్లలో బ్లీచింగ్ లేదా వంటసోడా వేసి ఖాళీగా తిప్పాలని సూచిస్తున్నారు. దీనివల్ల వాషింగ్ మెషీన్ లోపల క్రిమిరహితంగా మారుతుంది.
- బట్టలు ఉతకడమే కాదు.. వాషింగ్ మెషీన్‌ను సరిగ్గా వాడుతున్నామా ? లేదా ? అనేది గమనించుకోవాలి. తప్పనిసరిగా మెషీన్‌ను ప్రతి 3 వాష్‌లకు ఒకసారైనా బెల్ట్‌లోపల స్పాంజితో క్లీన్ చేయాలి.
- లేకపోతే అక్కడ మురికి చేరి వాషింగ్ మెషీన్ తొందరగా పాడవుతుంది. అలాగే బట్టల మురికి కూడా తొలగిపోదని నిపుణులు చెబుతున్నారు.