Small Dog Breeds :నేటి జనరేషన్‌లో ఇంట్లో కుక్కలను పెంచుకోవడం ఒక ట్రెండ్. సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే సాధారణ వ్యక్తుల వరకు అందరూ వివిధ రకాల కుక్కలను పెంచుకుంటున్నారు. నిజానికికుక్కలను పెంచుకోవడం వల్ల మనసు హాయిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. నగరాలు, పట్టణాల్లో చాలా మంది అద్దె ఇళ్లలో లేదా అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్నారు. దీంతో.. పెట్స్ పెంచుకునే ఛాన్స్ లేదని భావిస్తారు. కానీ.. ఇలాంటి వారు కూడా పెంచుకోవడానికి క్యూట్‌గా ఉండే బ్రీడ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రెంచ్ బుల్డాగ్ (French Bulldog) :
అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారు ఫ్రెంచ్ బుల్డాగ్ కుక్కలను పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే సాధారణంగా ఇవి 11 నుంచి 13 అంగుళాల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాయి. అలాగే చాలా తక్కువ బరువుంటాయి. వీటికి రోజూ ఎక్కువగా వ్యాయామం చేయించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సరదాగా పిల్లలతో ఆడుకుంటాయి. ఇవి చాలా ప్రేమగా ఉంటాయని నిపుణులంటున్నారు.
పోమరేనియన్ (Pomeranian) :
పోమెరేనియన్ జాతికి చెందిన కుక్కలు చూడటానికి బొచ్చుతో ఎంతో చిన్నగా క్యూట్‌గా ఉంటాయి. సాధారణంగా ఇవి గుండ్రని తలతో ఎంతో అందంగా కనిపిస్తాయి. అలాగే.. ఇవి చాలా చురుకుగా ఉంటాయని నిపుణులంటున్నారు. అపార్టమెంట్‌లలో లేదా అద్దె ఇంట్లో ఉండేవారు వీటిని రోజూ వ్యాయామానికి తీసుకొని వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. సాధారణంగా ఇవి 7 నుంచి 9 అంగుళాల ఎత్తుకు పెరుగుతాయి.
కావలీర్ కింగ్ చార్లెస్ స్పానియల్ (Cavalier King Charles Spaniel) :
అపార్ట్‌మెంట్‌లో ఉండే వారు కావలీర్ కింగ్ చార్లెస్ స్పానియల్ జాతికి చెందిన కుక్క పిల్లను పెంచుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా స్నేహంగా, ప్రేమతో ఉంటుంది. దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల పక్కన ఫ్లాట్‌లో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందీ కలగదని నిపుణులంటున్నారు.