తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బేకరీలో దొరికే ఎగ్ పఫ్స్ ఇంట్లోనే - అది కూడా ఓవెన్​ లేకుండానే! - ఇలా ప్రిపేర్ చేసుకోండి - Bakery Style Egg Puff Recipe

Bakery Style Egg Puff Recipe : మీకు ఎగ్ పఫ్​ అంటే చాలా ఇష్టమా? అయితే.. ఇకపై మీరు బేకరీకి వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్​గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్నికావాలంటే అన్ని లాంగించేయొచ్చు! మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

How To Make Egg Puff Without Oven
Bakery Style Egg Puff Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 1:25 PM IST

How To Make Egg Puff Without Oven :చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎక్కువ మంది ఇష్టపడి తినే స్నాక్ ఐటమ్​లో ఎగ్ పఫ్ కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది బేకరీ నుంచి తెప్పించుకొని తింటుంటారు. కానీ, ఇంట్లోనే వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును.. ఓవెన్ కూడా అవసరం లేకుండా చాలా సులభంగా ఎగ్ పఫ్​లను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మైదా - ఒక కప్పు
  • ఉప్పు - పావు టీస్పూన్
  • చక్కెర - పావు టీస్పూన్
  • బటర్ - 50 గ్రాములు

స్టఫింగ్ కోసం :

  • ఆయిల్ - 1 టేబుల్​స్పూన్
  • ఉల్లిపాయలు - 2 ( మీడియం సైజ్​లో ఉన్నవి)
  • పచ్చిమిర్చి - 2(సన్నగా తరుక్కోవాలి)
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
  • పసుపు - చిటికెడు
  • కారం - అర టీస్పూన్
  • అర టీస్పూన్ చొప్పున - జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా
  • ఎగ్స్ గార్నిష్ కోసం - కాస్త పెప్పర్ పొడి, కారం, ఉప్పు.

తయారీ విధానం :

  • ఒక బౌల్ తీసుకొని మైదా, ఉప్పు, పంచదార వేసుకొని తగినన్ని చల్లటి నీరు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా సాఫ్ట్​గా మారే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత దానిపై మూతపెట్టి 25 నుంచి 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన రెండుఎగ్స్(Eggs)ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అయితే, ఇక్కడ నాలుగు ఎగ్ పఫ్​లకు సరిపడా పదార్థాలనే చెబుతున్నాం. ఒకవేళ.. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలను పెంచుకోవాల్సి ఉంటుంది.
  • అనంతరం 50 గ్రాముల బటర్ తీసుకొని కాసేపు రూమ్ టెంపరేచర్​లో సాఫ్ట్​గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి.
  • ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని తీసుకొని మరోసారి 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత చపాతీ పీటపై పిండిని ఉంచి కాస్త పొడి పిండి చల్లుకుంటూ.. హాఫ్ ఇంచ్ మందంతో పల్చగా మారే వరకు రెక్ట్ యాంగిల్ షేప్​లో చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి.
  • ఆవిధంగా చేసుకున్నాక 25 గ్రాముల సాఫ్ట్ బటర్ తీసుకొని దానిపై మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేతితో రుద్దుకోవాలి. తర్వాత దానిపై కొంచం పొడి మైదా చల్లుకోవాలి.
  • అనంతరం మొదట రెండు చివరలను మధ్యలోకి ఫోల్డ్ చేసి.. తర్వాత మరోసారి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే.. బుక్ ఫోల్డ్ మాదిరిగా చేసుకోవాలి.
  • తర్వాత దానిపై మరోసారి కాస్త పొడి మైదా చల్లుకొని ఒక ప్లేట్​లోకి తీసుకొని, తడి క్లాత్​ దానిపై ఉంచి ఒక 20 నిమిషాల పాటు ప్రీజర్​లో పెట్టుకోవాలి.
  • ఆలోపు ఎగ్ పఫ్​ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం.. స్టౌపై ఒక చిన్న పాన్ పెట్టుకొని నూనె పోసుకొని సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్​లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆపై చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలాతో పాటు కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ప్రీజర్​లో ఉంచిన పిండిని తీసుకొని దానిపై కాస్త పొడి మైదా చల్లుకొని మరోసారి రెక్ట్ యాంగిల్ షేప్​లో అది స్ప్రెడ్ అయ్యేంత వరకు రోల్ చేసుకోవాలి.
  • తర్వాత మిగిలిన బటర్​ను దానిపై అప్లై చేసుకోవాలి. ఆపై కొంచం పొడి మైదాను చల్లుకొని మొదట చివరలను మధ్యకు ఫోల్డ్ చేసి.. తర్వాత మరోసారి ఫోల్డ్ చేసుకోవాలి. బుక్ ఫోల్డ్ మాదిరిగా చేసుకోవాలి.
  • అనంతరం దానిపై మరోసారి కొంచం పొడి మైదా చల్లుకొని ఒక ప్లేట్​లోకి తీసుకొని ఒక తడి క్లాత్​ పేస్ట్రీపై ఉంచి అరగంటపాటు మరోసారి ప్రీజర్​లో ఉంచుకోవాలి.
  • తర్వాత.. ఫ్రీజర్​లో ఉంచిన పఫ్ పేస్ట్రీ తీసుకొని సగానికి కట్ చేసుకోవాలి. అందులో ఒక పార్ట్​ను తీసుకొని కాస్త మైదా చల్లుకుంటూ స్క్వేర్ షేప్​లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఆపై దాన్ని నాలుగు సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్​ను సగానికి కట్ చేసుకొని వాటిపై కాస్త పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, ఉప్పు చల్లుకోవాలి.
  • తర్వాత కట్ చేసుకున్న నాలుగు పఫ్ పేస్ట్రీలపై ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ కర్రీని కొద్దికొద్దిగా వేసుకొని ఆపై ఎగ్స్​ని కట్ చేసిన భాగం ఆనియన్ కర్రీ వైపు ఉండేలా పెట్టుకోవాలి.
  • అనంతరం పేస్ట్రీ రెండు చివరలకు కాస్త వాటర్ లేదా పాలు అప్లై చేసుకొని ఎగ్ పఫ్ మాదిరిగా క్లోజ్ చేయాలి.
  • ఇప్పుడు స్టౌపై ఒక లోతుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో ఒక స్టాండ్ ఉంచి ఐదు నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత బేకింగ్ కోసం.. బేకింగ్ బౌల్ లేదా ప్లేట్​ తీసుకొని దానికి కాస్త ఆయిల్ లేదా బటర్ అప్లై చేసి ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పఫ్స్ అందులో ఉంచి ఫ్రీ హీట్ చేసుకొన్న గిన్నెలో పెట్టుకోవాలి.
  • అయితే, ఇక్కడ బేకింగ్ కోసం స్టీల్ పాత్రలను వాడొద్దనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అల్యూమినియం పాత్రలు బెస్ట్.
  • ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 30 నుంచి 35 నిమిషాల పాటు ఒకసారి ఎగ్ పఫ్స్​ను బేక్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత.. అవి బేక్ అయ్యాయనుకున్నాక రెండో వైపు తిప్పుకొని మరో 5 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
  • ఆవిధంగా బేక్ చేసుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్​లోకి తీసుకుంటే చాలు. అంతే.. క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే "ఎగ్ పఫ్స్" రెడీ!

ఇవీ చదవండి :

ఆశ్చర్యం : నూనె లేకుండా పూరీలు చేసుకోవచ్చు - ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ - ఎంతో టేస్టీగా ఉంటాయి!

స్వీట్​ షాప్​ స్టైల్లో "బూందీ లడ్డూ" - ఈ టిప్స్​తో తయారు చేస్తే అమోఘమైన రుచి!

ABOUT THE AUTHOR

...view details