Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా కోసం అయోధ్య నగరం ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి మహా కుంభమేళా జరుగుతుండడం వల్ల అయోధ్యను అందంగా తీర్చిదిద్దుతున్నారు. నూతన ఏడాదిలోకి అడుగుపెట్టడం, బాల రాముడు కొలువుదీరి సంవత్సరం పూర్తి కావొస్తుండటంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశాలు ఉంది. అందుకే ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
నూతన ఏడాది, మహా కుంభమేళా పురష్కరించుకొని అయోధ్య నగరం అందంగా ముస్తాబవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 44 రోజుల పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా కోసం అక్కడి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ కుంభమేళాకు కోట్ల మంది ప్రజలు తరలిరానున్నారు. కుంభమేళాకు వచ్చిన ప్రజలు అయోధ్య బాలరాముడి దర్శనానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామమందిర ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి కుంభమేళా జరుగుతుండడం వల్ల అయోధ్యలోనూ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అదే సమయంలో నూతన ఏడాదిలోకి అడుగుపెట్టడం., బాలరాముడు కొలువుదీరి సంవత్సరం పూర్తి కావొస్తుండటంతో అయోధ్యకు భారీగా భక్తులు తరలి రానున్నారు. దీంతో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామ మందిర దర్శన వేళలు పెంచుతూ రామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.
అయోధ్య నగర అలంకరణ
అయోధ్య నగర వీధులను రాముని చిత్రాలతో అందంగా అలంకరిస్తున్నారు. రామ చరిత మానస్‌ను గోడలపై రూపొందించారు. గుప్తర్ ఘాట్ నుంచి కొత్త ఘాట్ వరకు రామాయణ ఇతివృత్తాలను గోడలపై చిత్రాల రూపంలో రూపొందిస్తున్నారు. రాత్రి వేళలో కూడా కనిపించేలా వాటికి విద్యుత్ దీపాలను అమర్చారు. అయోధ్యకు తరలివచ్చే భక్తుల కోసం మంచి నీటి సదుపాయన్ని ఏర్పాటు చేశారు.
అలాగే అయోధ్యలోని సూరజ్‌కుండ్‌లో లేజర్ షోను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుంభమేళా జరుగుతోన్న అన్ని రోజులు లేజర్ షో జరుగుతుందని చెప్పారు. రామాయణ చరిత్రను హిందీ, ఇంగ్లీషు భాషలలో వీడియోల రూపంలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. కుంభమేళా కోసం వచ్చే విదేశీయులు కోసం ఆంగ్ల భాషలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు.