Avtar Saini Accident : ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ ఇండియా మాజీ అధ్యక్షుడు అవతార్ సైనీ(68) కన్నుమూశారు. నవీ ముంబయి టౌన్షిప్లో గురువారం ఉదయం సైక్లింగ్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ క్యాబ్ వచ్చి ఆయన్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను తోటీ సైక్లిస్టులు ఆస్పత్రికి తరలించగా- అప్పటికే చనిపోయారని వైద్యులు ప్రకటించారు.
ఈ ప్రమాదం బుధవారం ఉదయం 5.50 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన క్యాబ్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. సైనీని ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ అక్కిడినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని చెప్పారు. అయితే నిందుతుడి ఇంకా అరెస్టు చేయలేదని ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. సైనీ చనిపోయిన విషయాన్ని అమెరికాలో ఉన్న ఆయన పిల్లలకు తెలియజేశారు.
సైక్లింగ్ ప్యాషన్
సైక్లింగ్ అవతార్ సైనీ CACG అనే సైక్లింగ్ గ్రూప్‌లో ఉన్నారు. ట్రెక్కింగ్ సైక్లింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సేఫ్టీ పరికరాలు ధరించేవారని సమాచారం.
ఇంటెల్ ఇండియా తీవ్రవిచారం
Avtar Saini Intel :అవతార్ సైనీ మృతిపై ఇంటెల్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విజయవంతమైన ఆవిష్కర్తగా, అత్యుత్తమ నాయకుడిగా, విలువైన మార్గనిర్దేశకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొంది. అయితే సైనీ ఇంటెల్‌కు 22 ఏళ్ల పాటు సేవలందించారు.