Amit Shah on Congress :రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా . కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌కు, రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ విలువలను ఉల్లంఘించారని ఆరోపించారు. పార్లమెంట్లో అంబేడ్కర్ గురించి తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించదని, ఆయనను ఎప్పటికీ, కనీసం కలలోనూ అవమానించనలేని పార్టీ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈమేరకు స్పష్టత ఇచ్చారు.
'రాజ్యాంగ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్'
'కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేక పార్టీ. ఆయనకు భారతరత్న ఇవ్వలేదు. కేంద్రంలో బీజేపీ మద్దతు ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరణానంతరం ఆయనకు భారతరత్న ఇచ్చింది. కాంగ్రెస్ ఏనాడూ అంబేడ్కర్ స్మారకాన్ని నిర్మించలేదు. బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్‌ను ఎంతో గౌరవించింది. ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టంగా ఉన్న నా ప్రసంగం రాజ్యసభ రికార్డుల్లో ఉంది. కలలో కూడా అంబేడ్కర్ ఆలోచలను అవమానించలేని పార్టీ, సిద్ధాంతం నుంచి వచ్చా. ఎమర్జెన్నీ విధించడం ద్వారా రాజ్యాంగ విలువలను ఉల్లఘించింది. ఆ వాస్తవాలన్నీ బయటకు రాగానే కాంగ్రెస్ తన పాత ట్రిక్కులను ఉపయోగించి వాస్తవాలను వక్రీకరిస్తుంది' అని అమిత్ షా మండిపడ్డారు.