How to Make Aloo Masala Sandwich in Telugu : ఎవరికైనా డైలీ బ్రేక్‌ఫాస్ట్ సమయంలో లేదా స్నాక్స్ టైమ్‌లో ఒకే రకం ఆహారాలను పెడితే నచ్చదు. ఇక పిల్లలు అయితే.. డైలీ ఇడ్లీ, ఉప్మా, దోశయేనా మమ్మీ అని తినకుండా మారాం చేస్తుంటారు. రోజూ తిన్నవే తిని బోర్ కొడుతుందంటారు. కాబట్టి ఈసారి వారికి బోర్‌గా అనిపించకుండా కొత్తగా.. ఆలూ మసాలా సాండ్‌విచ్ చేసి పెట్టండి. దీని కోసం మిగతా బ్రేక్‌ఫాస్ట్(Breakfast) ఐటమ్స్‌లా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది. ఇవి రెండు మూడు తినగానే పొట్ట నిండిన భావన కలుగుతుంది. అంతేకాదు.. ఈ రెసిపీలో ఉపయోగించే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ ప్రాసెస్‌లో ఆలూ మసాలా సాండ్విచ్ను.. ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బ్రెడ్ ముక్కలు - నాలుగు
- బంగాళదుంప - 1
- బఠానీలు - పావు కప్పు
- టమాట కెచప్ - రెండు స్పూన్లు
- ఉల్లిపాయ - ఒకటి
- గరం మసాలా పొడి - పావు స్పూన్
- మిరియాల పొడి - పావు స్పూను
- ఉప్పు - రుచికి సరిపడా
- బటర్ - కొద్దిగా
- పుదీనా చట్నీ - రెండు స్పూన్లు
- చాట్ మసాలా - అర టీ స్పూన్