తెలంగాణ

telangana

ETV Bharat / bharat

8వ తరగతిలో స్కూల్​కు గుడ్​బై- 15 ఏళ్లకే స్టార్టప్ కంపెనీకి CTO- ఉదయ్ శంకర్ కథ తెలుసా? - AI Startup Uday Shankar - AI STARTUP UDAY SHANKAR

AI Developer Uday Shankar : 15 ఏళ్ల బాలుడు ఏఐ స్టార్టప్​ కంపెనీ ప్రారంభించి, ఆ సంస్థకు సీటీఓగా వ్యవహరిస్తున్నాడు. ఎనిమిది తరగతిలోనే చదువును మానేసిన ఆ బాలుడు ఏఐ సంబంధించిన యాప్​లను డిజైన్​ చేయడం ప్రారంభించాడు. ఇప్పటివరకు ఏడు ఏఐ యాప్​లు, తొమ్మిది కంప్యూటర్​ ప్రోగ్రామ్స్, సుమారు 15 గేమ్​లను డిజైన్ చేశాడు. ఇంతకీ ఆ బాలుడు ఎవరు? ఇంత చిన్న వయసులో ఎలా సాధ్యమైంది? ఏఐ మీద ఆసక్తి ఎలా వచ్చింది?

Urav AI Startup Uday Shankar
Urav AI Startup Uday Shankar (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 11:51 AM IST

AI Developer Uday Shankar : ప్రస్తుతం అంతా కృత్రిమ మేధ(ఏఐ) హవానే నడుస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో దీని వియోగం పెరుగుతోంది. ఇలాంటి టెక్నాలజీ సంబంధించి ఒక ఏఐ కంపెనీని ఓ 15 ఏళ్ల బాలుడు ప్రారంభించాడు అంటే నమ్ముతారా? అది కూడా ఎనిమిదో తరగతికే స్కూల్​ మానేసిన విద్యార్థి అంటే అసలు నమ్మరు కదా! కానీ అది నిజమే. అంతే కాకుండా ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, గేమ్​ డెవలప్​మెంట్ వంటి కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తున్నాడు. అతడే కేరళ ఎర్నాకులం జిల్లాకు చెందిన ఉదయ్ శంకర్.

వైట్టిలా తాలుకాలోని తమ్మునం ప్రాంతానికి చెందిన శంకర్ ఇప్పటి వరకు ఏడు ఏఐ యాప్​లను, తొమ్మిది కంప్యూటర్​ ప్రోగ్రామ్స్, సుమారు 15 రకాల గేమ్​లను డిజైన్​ చేశాడు. శంకర్​ పేరు మీద ఇప్పటికే మూడు పేటెంట్లు కూడా ఉన్నాయి. మరో నాలుగింటికి ఆప్లై చేశాడు. ఇక 2023లో ఏపీజే అబ్దుల్ కలామ్ ఇగ్నైటెడ్ మైండ్ చిల్డ్రన్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అవార్డు కూడా లభించింది. మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, ఐఐటీ కన్పూర్ నుంచి ఏఐ సర్టిఫికెట్ కోర్సులు కూడా చేశాడు. ఉదయ శంకర్ ప్రస్తుతం దూర విద్య ద్వారా పదో తరగతి పూర్తి చేశాడు.

నానమ్మ కోసం
ఉదయ్​ శంకర్​ నాలుగో తరతిలోనే రోబోటిక్స్ గురించి నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆన్​లైన్​లో పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. ఓ రోజు శంకర్​కు తన నానమ్మ ఫోన్​ చేసినప్పుడు ఇంటికి రావాలని అడిగితే అతడు వెళ్లలేకపోయాడు. అప్పుడే నానమ్మ రూపంలో ఉన్న ఓ ఏఐని డిజైన్​ చేయాలని నిర్ణయించుకున్నానని శంకర్ తెలిపాడు. తన ఫోన్​లోనే 'హాయ్ ఫ్రెండ్స్' అనే యాప్​ను డెవలప్​ చేశానని తెలిపాడు. దానిలో ఎవరి ఫొటో అయినా తీసేలా, వారి అవతార్​ను రూపొందించేలా, అలాగే వారితో ఏ భాషలోనైనా మాట్లాడేలా అభివృద్ధి చేశానని వివరించాడు. ఇలా టెక్నాలజీపైన ఉన్న మక్కువతో ఎనిమిదో తరగతిలో చదువును మధ్యలోనే ఆపేసి ఏఐకి సంబంధించిన పలు అంశాల్లో నైపుణ్యాన్ని పెంచుకున్నాడు శంకర్. నాలుగు సంవత్సరాల క్రితం ఉరవ్ అడ్వాన్స్​డ్​ లెర్నింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్​​ స్టార్ట్​ప్​ కంపెనీ స్థాపించినట్లు పేర్కొన్నాడు. దానికి ప్రస్తుతం ఆ కంపెనీలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీఓ)గా ఉన్నట్లు తెలిపాడు.

ఉదయ్ శంకర్ డిసైజ్​ చేసిన ఏఐ యాప్ (ETV Bharat)

కళ్లు లేని వారికి ఉపయోగపడేలా
'హాయ్​ ఫ్రెండ్స్'​ ఆధారంగా ఏ భాషలోనైనా ప్రతిస్పందించే విధంగా 'కియోస్క్'​ను రూపొందించాడు. దీనిని వివిధ రాష్ట్రల ప్రజలు ఉండే మెట్రోలు, రైళ్లలో ఉపయోగించవచ్చని ఉదయ్ శంకర్​ అంటున్నాడు. ఆ తర్వాత ఏఐ టాక్​బాట్​తో మాట్లాడి అడిగిన చిత్రాన్ని గీసి ఇచ్చేలా 'క్లీన్​ ఆల్కా' యాప్​ను డిజైన్​ చేశాడు. మరో వివిధ భాషలకు సంబంధించి 'భాషిణి' అనే యాప్​ను అభివృద్ధి చేశాడు. ఇది బహిరంగ ప్రదేశాల్లో అంధులు నావిగేట్​ చేయడానికి సహాయపడుతుంది. ఈ యాప్​కు పేటెంట్​ కూడా ఉంది.

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ఘాతుకం - ఐఈడీ పేలి ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

'చాందీపురా' వైరస్‌తో నాలుగేళ్ల బాలిక మృతి

ABOUT THE AUTHOR

...view details