తెలంగాణ

telangana

ETV Bharat / bharat

18వ లోక్‌సభ తొలి సెషన్- ఎంపీలుగా ప్రమాణం చేసిన మోదీ, కేంద్రమంత్రులు - Parliament Session 2024

Lok Sabha First Session Live Updates
Lok Sabha First Session Live Updates (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 9:34 AM IST

Updated : Jun 24, 2024, 2:28 PM IST

Lok Sabha First Session Live Updates : కొత్త లోక్‌సభ కొలువుదీరింది. సోమవారం ఉదయం 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏడోసారి ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మహతాబ్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. అనంతరం లోక్‌సభలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎంపీలతో ప్రొటెంస్పీకర్‌ ప్రమాణం చేయించారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లంతో సహా భారతీయ భాషల్లో ఎంపీలు ప్రమాణం చేయడం వల్ల లోక్‌సభలో భాషాపరమైన వైవిధ్యాన్ని ప్రదర్శించింది.

LIVE FEED

10:49 PM, 24 Jun 2024 (IST)

కొత్త లోక్‌సభ కొలువుదీరింది. సోమవారం ఉదయం 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభం కాగా ప్రొటెంస్పీకర్‌గా ఎన్నికైన భర్తృహరి మహతాబ్‌ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రమాణం చేయించారు. అక్కడి నుంచి లోక్‌సభకు చేరుకున్న ప్రొటెమ్‌ స్పీకర్‌ సభ ప్రారంభం కాగానే తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభలోని మిత్రపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. విపక్ష ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతులను ఊపారు.

తర్వాత ప్రొటెం స్పీకర్‌ లోక్‌సభలో సీనియర్‌ నేతలైన రాధామోహన్‌సింగ్‌, ఫగ్గన్‌సింగ్‌ కులస్తేలతో ముందుగా ప్రమాణం చేయించారు. తర్వాత కేంద్ర కేబినేట్‌ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌చౌహాన్‌, మనోహర్‌లాల్‌ కట్టర్‌ తదితరులు ప్రమాణం చేశారు. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేస్తున్న సమయంలో విపక్ష ఎంపీలు నీట్-నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తర్వాత కేంద్ర సహాయ మంత్రులు, మిగిలిన నేతలు 18వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఆంగ్లం, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.

ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్‌ను నియమించినందుకు నిరసనగా ప్రమాణ స్వీకారం ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యుడు కొడికున్నిల్ సురేష్, డీఎంకే ఎంపీ బాలు, TMC ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ సభ నుంచి వాకౌట్ చేశారు. 280 మంది ఎంపీలు తొలిరోజు ప్రమాణ స్వీకారం చేయగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా మిగిలిన సభ్యులు మంగళవారం ప్రమాణం చేయనున్నారు. జూన్ 26న లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్ లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

1:06 PM, 24 Jun 2024 (IST)

మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్​సభ వాయిదా పడింది.

1:04 PM, 24 Jun 2024 (IST)

  • దగ్గుబాటి పురందేశ్వరి ప్రమాణం
  • లోక్‌సభ సభ్యుడిగా ఉదయ్‌ శ్రీనివాస్‌ ప్రమాణస్వీకారం
  • ఆంగ్లంలో ప్రమాణస్వీకారం చేసిన ఉదయ్‌ శ్రీనివాస్‌
  • లోక్‌సభ సభ్యుడిగా హరీష్‌ బాలయోగి ప్రమాణస్వీకారం
  • ఆంగ్లంలో ప్రమాణస్వీకారం చేసిన హరీష్‌ బాలయోగి
  • లోక్‌సభ సభ్యురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి ప్రమాణస్వీకారం
  • తెలుగులో ప్రమాణం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి
  • లోక్‌సభ సభ్యుడిగా పుట్టా మహేశ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం
  • ఆంగ్లంలో ప్రమాణం చేసిన పుట్టా మహేశ్‌కుమార్‌
  • లోక్‌సభ సభ్యుడిగా వల్లభనేని బాలశౌరి ప్రమాణస్వీకారం
  • తెలుగులో ప్రమాణం చేసిన వల్లభనేని బాలశౌరి
  • లోక్‌సభ సభ్యుడిగా కేశినేని శివనాథ్‌ ప్రమాణస్వీకారం
  • తెలుగులో ప్రమాణం చేసిన కేశినేని శివనాథ్‌

12:46 PM, 24 Jun 2024 (IST)

కొనసాగుతున్న సభ్యుల ప్రమాణ స్వీకారం

  • లోక్‌సభ సభ్యులుగా సుకాంతో మజుందార్, సావిత్రి ఠాకూర్ ప్రమాణం
  • లోక్‌సభ సభ్యులుగా రాజ్​భూషన్ చౌధరి, హర్ష్​ మల్హోత్రా ప్రమాణం
  • లోక్‌సభ సభ్యులుగా నిమూబెన్​ బాంభనియా జయంతి భాయ్, మురళీ ధర్​ మహోల్, విష్ణుపద రాయ్ ప్రమాణం
  • లోక్‌సభ సభ్యులుగా గుమ్మ తనూజా రాణి, అప్పల నాయుడు, శ్రీ భరత్​, సీఎం రమేశ్ ప్రమాణం

12:28 PM, 24 Jun 2024 (IST)

  • లోక్‌సభ సభ్యుడిగా బండి సంజయ్‌ ప్రమాణస్వీకారం
  • తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన బండి సంజయ్‌
  • లోక్​సభ సభ్యులుగా పెమ్మసాని చంద్రశేఖర్, ​సురేశ్​ గోపి ప్రమాణం
  • లోక్‌సభ సభ్యులుగా జితేంద్ర సింగ్, అర్జున్ రామ్​ మేఘ్​వాల్ ప్రమాణ స్వీకారం
  • లోక్‌సభ సభ్యులుగా ప్రతాప్​ రావ్ గణపత్​ రావ్, జితిన్ ప్రసాద్, శ్రీపత్​ యశో నాయక్ ప్రమాణ స్వీకారం

11:51 AM, 24 Jun 2024 (IST)

తెలుగులో కిషన్​ రెడ్డి ప్రమాణం

  • లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేసిన జి కిషన్​ రెడ్డి అన్నపూర్ణ దేవీ, కిరెన్​ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్
  • లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేసిన డాక్టర్ మన్​సుక్​ మాండవీయ, చిరాగ్​ పాసవాన్, సీఆర్​ పాటిల్

11:43 AM, 24 Jun 2024 (IST)

తెలుగులో రామ్మోహన్‌నాయుడు ప్రమాణం

  • లోక్‌సభ సభ్యుడిగా రామ్మోహన్‌నాయుడు ప్రమాణస్వీకారం
  • తెలుగులో ప్రమాణం చేసిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు
  • లోక్‌సభ సభ్యులుగా పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రమాణస్వీకారం, సర్బానంద సోనోవాల్, జితిన్‌రామ్‌ మాంఝీ
  • లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేసిన జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్

11:20 AM, 24 Jun 2024 (IST)

లోక్‌సభ సభ్యులుగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం

లోక్‌సభ సభ్యులుగా అమిత్‌షా, ఫగ్గన్‌సింగ్‌ కులస్తే ప్రమాణస్వీకారం

లోక్‌సభ సభ్యులుగా గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మనోహర్​ లాల్​ ఖట్టర్, కుమారస్వామి ప్రమాణస్వీకారం

11:11 AM, 24 Jun 2024 (IST)

  • లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం
  • లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ
  • లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేసిన రాధామోహన్‌ సింగ్‌

10:59 AM, 24 Jun 2024 (IST)

  • 18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం
  • కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం
  • రెండ్రోజులపాటు లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకారాలు
  • ప్రస్తుత లోక్‌సభలో అడుగుపెట్టేవారిలో సగానికి పైగా కొత్తవారే
  • మొత్తం 543 మంది సభ్యుల్లో తొలిసారి లోక్‌సభకు 280 మంది సభ్యులు

10:48 AM, 24 Jun 2024 (IST)

ఎమర్జెన్సీ ఒక మచ్చ : మోదీ
'సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నాం. రాజ్యాంగ ప్రొటోకాల్స్‌ పాటిస్తాం. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నాం. అత్యయిక పరిస్థితికి రేపటి 50 ఏళ్లు పూర్తవుతాయి అత్యయిక పరిస్థితి ఒక మచ్చ. ప్రధాని మోదీ 50 ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలి. విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మూడోసారి అధికారంలోకి రావడం వల్ల మాపై మరింత బాధ్యత పెరిగింది.' అని ప్రధాని మోదీ అన్నారు.

10:37 AM, 24 Jun 2024 (IST)

వికసిత భారత్​ లక్ష్యంగా ముందుకు సాగుదాం : ప్రధాని
18వ లోక్​సభ తొలి సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్​కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతాభినందనలు. కొత్త పార్లమెంటులో 18వ లోక్‌సభ సమావేశమవుతోంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేయాలి. 2047 వికసిత్‌ భారత్‌ సంకల్పం, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకుసాగుదాం. మూడోసారి సేవచేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారు. సభ్యులందరినీ కలుపుకొని వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రజలు మా విధానాలను విశ్వసించారు' అని ప్రధాని మోదీ అన్నారు.

10:32 AM, 24 Jun 2024 (IST)

పార్లమెంట్​కు చేరుకున్న ప్రధాని
18వ లోక్​సభ తొలి సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్​కు చేరుకున్నారు.

10:06 AM, 24 Jun 2024 (IST)

ప్రొటెం స్పీకర్​గా భర్తృహరి ప్రమాణం
18వ లోక్​సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలుత ప్రొటెం స్పీకర్​గా భర్తృహరి మహతాబ్​ చేతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. భర్తృహరి మహతాబ్‌ ఏడుసార్లు ఎంపీగా పనిచేశారు.

9:58 AM, 24 Jun 2024 (IST)

ప్రొటెం స్పీకర్​ ఎప్పుడూ సమస్య కాదు
ప్రొటెం స్పీకర్​ అనేది భారత పార్లమెంట్​ చరిత్రలో ఎన్నడూ సమస్య కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్​ రిజిజు అన్నారు. ఆయన బాధ్యత కేవలం కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించడం, కొత్త స్పీకర్​ ఎన్నికలో సహాయం అందించడమే అని తెలిపారు. ఈ మేరకు తాను కలిసిన అందరి నేతలను కలిశానని, ఇప్పుడు డీఎంకే పార్లమెంటరీ పార్టీ నాయకుడు టీఆర్​ బాలుని కలిశానని, వారందరూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని రిజిజు పేర్కొన్నారు.

Last Updated : Jun 24, 2024, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details