తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మినీ ఫారెస్ట్​లా 150 ఏళ్ల మర్రి చెట్టు- బ్రిటిషర్లు నాటారట- 5డిగ్రీల ఉష్టోగ్రత తక్కువే! - 150 Years Old Banyan Tree - 150 YEARS OLD BANYAN TREE

150 Years Old Banyan Tree In Bihar : 150 సంవత్సరాల నాటి ఓ మర్రిచెట్టు చిన్నపాటి అడవిని సృష్టించింది. చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలో 5 డిగ్రీల ఉష్టోగ్రత తక్కువగా ఉండి హాయినిస్తుంది. దీంతో వేసవి కాలంలో చల్లదనం కోసం స్థానికులు ఈ చెట్టు దగ్గరకు వచ్చి సేద తీరుతున్నారు. ఇంతకీ ఆ వృక్షం ఎక్కడ ఉంది? ఎవరు నాటారనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.

150 Years Old Banyan Tree In Bihar
150 Years Old Banyan Tree In Bihar (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 3:10 PM IST

మినీ ఫారెస్ట్​లా 150 ఏళ్ల మర్రి చెట్టు - మిగతా ప్రాంతాల్లో కంటే 5 డిగ్రీల ఉష్టోగ్రత తక్కువే! (ETV Bharat)

150 Years Old Banyan Tree In Bihar : బిహార్‌లో ఒకే ఒక వృక్షం ఏకంగా అడవిని సృష్టించింది. గోపాల్‌గంజ్ జిల్లాలోని బైకుంత్‌పుర్ బ్లాక్‌లోని సోనాసతీ దేవి ఆలయానికి సమీపంలో ఉన్న ఈ 150 ఏళ్ల నాటి భారీ మర్రి చెట్టు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చెట్టు సుమారు 200 కొమ్మలతో అడవిలా విస్తరించి ఆశ్చర్యపరుస్తుంది. దీంతో స్థానికంగా వెలసిన సోనాసతీ దేవిని పూజించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇది చల్లదనం సేద తీరే స్థలంగా మారిపోయింది.

వేసవిలో కూడా చల్లదనమే
ఈ చెట్టు సమీపంలో ఉష్ణోగ్రత ఇతర ప్రదేశాల కంటే 5 నుంచి 6 డిగ్రీలు తక్కువగా ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ సంజయ్ పాండే తెలిపారు. 'వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ అధికంగా ఉండటం వల్ల కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది. సాధారణంగానే చెట్లు కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి. ఇక ఈ చెట్టు చాలా పెద్దది కావటం వల్ల సంవత్సరానికి 260 టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించగలదు. రోజుకు 50 నుంచి 60కిలో గ్రాములు కార్బన్​డయాక్సైడ్​ను గ్రహిస్తాయి. అధికంగా ఆక్సిజన్​ను విడుదల చేస్తుంది. అందుకే మిగతా ప్రాంతాల్లో కంటే ఈ చెట్టు దగ్గర 5 డిగ్రీల ఉష్టోగ్రత తక్కువగా ఉంటుంది. ఫ్యాక్టరీల కారణంగా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక దాదాపు 240 ఉంటుంది. కానీ ఈ భారీ మర్రి చెట్టు దగ్గర గాలి నాణ్యత చూస్తే చాలా మెరుగ్గా ఉంటుంది' అని సంజయ్ పాండే తెలిపారు.

'బ్రిటిష్​ వాళ్లే నాటారు'
ఈ మర్రి చెట్టు 200 కొమ్మలతో విస్తరించడం వల్ల చల్లగా ఉంటుందని స్థానికుడు విందేశ్వరీ రాయ్(70) తెలిపారు. 'బ్రిటీష్​ వారు ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీలిమందు సాగు చేసేవారు. ఆ తర్వాత వాళ్లే ఈ చెట్టును నాటారు. ఇది పెద్ద అడవిలా విస్తరించింది. క్రమంగా ఈ ప్రాంతంలో భూ ఆక్రమణలు జరగడం వల్ల విస్తీర్ణం తగ్గింది. వేసవిలో చాలా చల్లగా ఉంటుంది. వర్షకాలంలో వస్తే ఇదంతా దట్టమైన అడవిగా మారిపోతుంది' అని విందేశ్వరీ రాయ్ తెలిపాడు.

హింసాత్మకంగా మారిన నిరసన- కలెక్టరేట్​లో 200వాహనాలకు నిప్పు- 40మంది పోలీసులకు గాయాలు! - Balodabazar Violence

గుడ్ న్యూస్- యూనివర్సిటీల్లో ఇకపై ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు - UGC Admissions

ABOUT THE AUTHOR

...view details