కారులోనే స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్.. 100 అడుగులతో..! - 100 అడుగుల కారు
🎬 Watch Now: Feature Video
World's Longest Car: ఓ కారులో అత్యధికంగా 10 మంది కూర్చోవచ్చు. లిమోసిన్ లాంటి పొడవైన కారులో 18 మంది ప్రయాణించొచ్చు. కానీ 70 మంది ప్రయాణించగలిగే కారు గురించి విన్నారా? అమెరికన్ డ్రీమ్‌గా పేర్కొనే ఈ కారు ప్రస్తుతం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. 100 అడుగుల పొడవుగల ఈ కారు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. స్విమ్మింగ్ పూల్, మినీ గోల్ఫ్ కోర్స్, హెలిప్యాడ్, వాటర్ బెడ్ వంటివి ఏర్పాటు చేశారు అమెరికాకు చెందిన తయారీదారు జేయ్ ఓహర్బెర్గ్. 26 చక్రాలతో నడిచే ఈ కారులో ముందు రెండు, వెనుక రెండు ఇంజిన్లు ఉంటాయి. మొదట ఈ కారును 60 అడుగుల పొడవుతో తయారు చేసినా.. ఆ తర్వాత దీనిని 100 అడుగులకు పొడిగించారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST