నదిలో బైక్​ నడిపిన యువకుడు.. అయోధ్య వాసుల ఆగ్రహం! - రామ్​ కీ పైడీలో బైక్​ నడిపిన యువకుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 5, 2022, 7:26 PM IST

Ram Ki Paidi Ayodhya: కొద్దిరోజుల క్రితం ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలోని పవిత్ర సరయూ నదిలో ఓ జంట అసభ్యంగా ప్రవర్తించారని కొందరు కొట్టడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఇది రామ్​ కీ పైడీ సమీపంలోనే జరిగింది. ఇప్పుడు.. అదే పవిత్ర స్థలంలో ఓ యువకుడు నీళ్లలో బైక్​ నడపడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో.. వందల మంది రాముడి నడయాడిన రామ్​ కీ పైడీ ఘాట్​ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కాగా.. అయోధ్య వాసులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.