ఏటీఎం నగదు జమ చేస్తుండగా కత్తులతో బెదిరించి రూ.1.92 లక్షలు చోరీ - ఏటీఎంలో నగదు చోరీ
🎬 Watch Now: Feature Video
ఏటీఎంలో నగదు జమ చేస్తున్న వ్యక్తి వద్ద రూ.1.92 లక్షలు దొంగతనం చేశారు ముగ్గురు ఆగంతుకులు. గుజరాత్ సూరత్‌కు చెందిన చందన్‌కుమార్ నగదు జమ చేసేందుకు జీఐడీసీలోని ఏటీఎంకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఏటీఎంలోకి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి నగదుతో పాటు సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఏటీఎం సీసీటీవీలో నమోదయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.