Live Video: టోల్‌గేటు వద్ద అంబులెన్స్ బోల్తా.. నలుగురు మృతి - కర్ణాటక ఉడుపి వార్తలు
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని ఉడుపి జిల్లా శిరూరు టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరగ్గా.. అంబులెన్స్‌లోని నలుగురు మరణించారు. టోల్గేట్ వద్ద ఒక లేన్‌కు బారికేడ్లు అడ్డుపెట్టిన సిబ్బంది అంబులెన్స్ రావడం గుర్తించి హుటాహుటిన వాటిని తొలిగించారు. వేగంగా వస్తున్న అంబులెన్స్ డ్రైవర్.. కాస్త వేగం తగ్గించేందుకు బ్రేక్ వేశాడు. అయితే రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉండటం వల్ల ఆ వాహనం అదుపు తప్పింది. అక్కడే ఉన్న ఓ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో అంబులెన్స్ కోసం రోడ్డు క్లియర్ చేసేందుకు ప్రయత్నించిన ఓ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
Last Updated : Jul 20, 2022, 9:09 PM IST