సెక్యూరిటీ గార్డును కొట్టి కట్టేసి.. పెట్రోల్ బంకుల్లో లక్షలు చోరీ - పెట్రోల్ బంకు
🎬 Watch Now: Feature Video
Petrol Pumps Theft: కేరళలో రెండు వేర్వేరు చోట్ల పెట్రోల్ బంకుల్లో దొంగతనాలు చేశారు దుండగులు. మొత్తం లక్షా 80 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. కోజికోడ్ జిల్లా కొట్టోళిలో తొలుత హెచ్‌పీసీఎల్ పెట్రోల్ పంప్లో సెక్యూరిటీ గార్డును దారుణంగా కొట్టి.. అనంతరం కట్టేసి రూ. 50 వేలు చోరీ చేశాడు ఓ వ్యక్తి. మాస్కు ధరించిన దుండగుడు సిబ్బందిని కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బుధవారం అర్ధరాత్రి ఆఫీస్‌లోకి చొరబడ్డ దుండగుడు కారప్పొడి చల్లి సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడ్డాడు. ఎర్నాకుళంలో జరిగిన మరో ఘటనలో పెట్రోల్ పంప్‌లోకి అర్ధరాత్రి 3 గంటలకు ప్రవేశించిన మరో దుండగుడు.. రూ. 1.30 లక్షలు సహా 12 వేలు విలువచేసే ఓ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. సీసీటీవీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.