ETV Bharat / spiritual

"అష్ట కష్టాలు" నిజంగానే ఉన్నాయి - శివరాత్రి వేళ తప్పక తెలుసుకోండి - ఇందులో మీరెన్ని పడుతున్నారు? - ASHTA KASHTALU SIGNIFICANCE

- చాలా వరకు మనం కొని తెచ్చుకున్నవే - సరైన ప్రణాళికతో అన్నీ దూరం చేసుకోవచ్చు!

Ashta Kashtalu
Ashta Kashtalu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 3:38 PM IST

Ashta Kashtalu : "అష్ట కష్టాలు పడుతున్నారు" అనే మాట మనం తరచూ వింటూనే ఉంటాం. కష్టాల తీవ్రతను తెలిపేందుకు చాలా మంది ఇలా అంటుంటారు. కానీ, నిజంగానే "అష్ట కష్టాలు" అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. అష్ట అంటే ఎనిమిది. జీవితంలో ఎదురయ్యే అత్యంత తీవ్రమైన కష్టాలను 8 భాగాలుగా సనాతన ధర్మం విభజించిందని పండితులు ప్రహ్లాద్ చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.

శ్లోకం రూపంలో ఆ కష్టాలను వివరించారు. రుణం, యాచ్యాచ, వృద్ధత్వం, జార, చోర, దరిద్రతా, రోగశ్చ, బుక్త శేషశ్చా, హ్యష్ట కష్టాః ప్రకీర్తితాః' అని విభజించారు.

రుణం : అంటే ఆర్థిక సమస్యలతో అతలాకుతలమైపోవడం. బతకడానికి కూడా డబ్బులేక అప్పులు చేస్తూ అవస్థలు పడుతూ ఉండడం.

యాచ్యాచ : అంటే భిక్షాటన చేయడం. అంటే ఏవిధమైన ఆదెరువు లేక, జీవించడానికి అడుక్కోవాల్సిన రావడం.

వృద్ధత్వం : ముసలితనంలో శక్తి పూర్తిగా ఉడిగిపోయి, వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేకపోవడం. తిండీ తిప్పలతోపాటు సొంత పనుల కోసమూ ఇతరులపైన ఆధారపడే పరిస్థితి రావడం.

జార : జీవితంలో అన్నింటా దిగజారిపోవడం. ఎందుకూ గొరగాకుండా పోయి అవమానాలపాలవడం.

చోర : దొంగగా ముద్ర పడడం. సమాజంలో ఏ మాత్రం నమ్మకం లేకుండా పోవడం.

దరిద్రతా : జీవితంలో అన్నింటా దారిద్య్రం తాండవించడం.

రోగశ్చ : దీర్ఘకాలిక రోగాలతో అవస్థలు పడడం. ఈ వ్యాధి పీడతో సుఖ, సంతోషాలన్నవే లేకుండా పోవడం.

బుక్త శేషశ్చా : ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతరుల ఎంగిలి మెతులుకు తినాల్సి రావడం.

కొని తెచ్చుకున్నవే :

మనుషులు ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన కష్టాలు ఇవే. ప్రతి కష్టమూ ఇందులో ఏదో ఒక భాగానికి చెందినదై ఉంటుంది. అయితే, నిజానికి ఇందులో చాలా కష్టాలను మనుషులు తామే కొనితెచ్చుకుంటారని ప్రహ్లాద్ చెబుతున్నారు. కొన్ని నిర్లక్ష్యం కారణంగా, మరికొన్ని సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వస్తాయని హెచ్చరిస్తున్నారు.

కానీ, "తమ బాధలకు కారణం తామే" అనే విషయాన్ని చాలా మంది అంగీకరించరు. తాము పడుతున్న కష్టాలకు కారణం వేరేవాళ్లని నిందిస్తూ ఉంటారని అంటున్నారు. వాటిని నిబ్బరంగా అనుభవించకుండా, ఏడుస్తూ బతుకును ఈడ్చుకుపోతూ ఉంటారని చెబుతున్నారు. ఎవరూ పడని కష్టాలు మీరే పడుతున్నారంటే మాత్రం, అవి పూర్వ కర్మల ఫలితమేనని అర్థం చేసుకోవాలట.

అయితే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మనం ఎలా ఉండాలనేది మన చేతిలోనే ఉంటుందని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. కష్టాలు వ్యాధులు రావడమనేది మన అధీనంలో ఉండకపోవచ్చు. కానీ బాధపడాలా వద్దా?, ఏడుస్తూ బతకాలా వద్దా? అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

శివరాత్రి ఉపవాసాల్లో 5 రకాలు! - మీరు పాటించేది ఏ రకం? - శివయ్య ఆశీస్సులు మీ పైనే!

ఆహారం తినకపోతే ఉపవాసం చేసినట్లా? శివరాత్రి జాగారం ఎందుకు చేస్తారో మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.