30 సెకన్లలో 10 చెంప దెబ్బలు.. హోంవర్క్ చేయని చిన్నారిపై టీచర్ కర్కశత్వం - teacher beats up student
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15805164-24-15805164-1657630916038.jpg)
ఐదేళ్ల చిన్నారి పట్ల ఓ ఉపాధ్యాయురాలు అత్యంత క్రూరంగా వ్యవహరించింది. హోంవర్క్ ఎందుకు చేయలేదంటూ 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు కొట్టింది. ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్ జిల్లా అసోహా మండలం ఇస్లామ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో జులై 9న ఈ ఘటన జరిగింది. అదే రోజు సాయంత్రం బాలిక తల్లిదండ్రులు ముఖంపై వాతలు గుర్తించి.. వెంటనే బడికి వచ్చారు. టీచర్ను తీవ్రంగా మందలించారు. మళ్లీ ఇలాంటి పని చేయనని ఆమెతో లేఖ రాయించారు. అయితే.. నాటి వీడియో ఇప్పుడు వైరల్ కాగా.. విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్ను, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు.