గుంతల రోడ్డుపై దొర్లుతూ సామాజిక కార్యకర్త వినూత్న నిరసన - social worker unique protest
🎬 Watch Now: Feature Video

కర్ణాటకలోని ఉడుపికి చెందిన నిత్యానంద అనే సామాజిక కార్యకర్త వినూత్నంగా నిరసన చేపట్టాడు. ఇంద్రాలి రైల్వే బ్రిడ్జి సమీపంలోని రోడ్డుపై అనేక చోట్ల గుంతలు ఏర్పడినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రోడ్డుపైనే దొర్లాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.