బస్ డ్రైవర్ సడెన్ బ్రేక్.. 9 వాహనాలు ధ్వంసం.. 20 మందికిపైగా తీవ్రగాయాలు - రోడ్డు ప్రమాదాలా
🎬 Watch Now: Feature Video
బెంగళూరులో హోసకోటె టోల్గేట్ సమీపంలో వరుసగా వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందు వెళుతున్న బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో తొమ్మిది వాహనాలు ధ్వంసమయ్యాయి. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ధ్వంసమైన వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నవి కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు