అతివేగంతో ఢీకొన్న బైక్స్.. ఒకరు దుర్మరణం.. భయానక దృశ్యాలు వైరల్ - Road accident in bangalore
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15436710-thumbnail-3x2-road-accident-in-bangaluru.jpg)
Scooty Bike Collision Bengaluru: కర్ణాటక బెంగళూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్, స్కూటీ అతివేగంతో వచ్చి పరస్పరం ఢీకొన్నాయి. ప్రశాంత్ నగర్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో.. స్కూటీ నడిపే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయాలైన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మృతుడిని బెంగళూరు నివాసి, పేపర్ డిస్ట్రిబ్యూటర్గా పనిచేసే మిథున్గా గుర్తించారు. ఘటనకు సంబంధించి.. విజయనగర ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సీసీటీవీలో రికార్డైన సంబంధిత దృశ్యాలు.. భయానకంగా ఉన్నాయి.