TS Prathidhwani :వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ ఆలోచన ఏమిటి? - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
వడ్డీ రేట్లు... ఇంకెంత భారం! ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న. 45 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మేలో కీలక వడ్డీ రేట్ల వాతలు మొదలు పెట్టింది... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద్రవ్యోల్బణం కట్టడి..., అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు... ఇలా అనేక కారణాలు కలగలసి.. ఇప్పటికే 140 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయి వడ్డీరేట్లు. ఇప్పుడు మరో 50 పాయింట్లు భారం తప్పక పోవచ్చు అంటోంది ప్రముఖ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ. అసలు ధరల పెరుగుదల కట్టడికి - ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడానికి సంబంధం ఏమిటి? రెపో రేట్‌లో లింకై ఉన్న ఏ ఏ రంగాలపై ఈ ప్రభావం ఉంటుంది? దేశ ఆర్థికవ్యవస్థ, సామాన్య ప్రజలపై వడ్డీరేట్ల పెంపు ప్రభావం ప్రత్యక్షంగా...పరోక్షంగా ఎలా ఉంటుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.