ప్రతిధ్వని: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంసిద్దమౌతోన్న టీకాలు - కొవిడ్ టీకాలు వార్తలు
🎬 Watch Now: Feature Video
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే టీకాలు సంసిద్ధమౌతున్నాయి. వచ్చే మూడు, నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఆక్స్ఫర్డ్ టీకా వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో అందుబాటులోకి తెస్తామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది. ఫైజర్ టీకా మూడో దశ ప్రయోగాలు పూర్తి చేసుకుని ఈ ఏడాది చివరి నాటికి పంపిణీకి సిద్ధమౌతోంది. కరోనా రెండో దశ భయపెడుతున్న నేపథ్యంలో...కరోనా టీకాపై వివిధ ప్రయోగాలు ఎలాంటి ఆశలను కల్పిస్తున్నాయి, ముఖ్యంగా కరోనా టీకా ఎంత తొందరగా అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.