నది దాటి ఊర్లోకి వచ్చిన ఏనుగు పిల్ల.. గ్రామస్థుల ఆటలు!.. అధికారులు వచ్చి.. - నది దాటుతూ తప్పిపోయిన పిల్లఏనుగు
🎬 Watch Now: Feature Video
నది దాటుతూ తప్పిపోయి గ్రామానికి వచ్చిన ఓ ఏనుగు పిల్లను తిరిగి అడవిలోకి విడిచిపెట్టారు అటవీ శాఖ అధికారులు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పుర్ జిల్లాలో జిరిగింది. తప్కారా అటవీ ప్రాంత సమీపంలో ప్రవహిస్తున్న ఈబ్ నది దాటుతూ ఓ ఏనుగు పిల్ల తన గుంపు నుంచి తప్పిపోయి సందామ గ్రామానికి చేరుకుంది. గ్రామస్థులంతా ఆ ఏనుగు పిల్లతో సరదాగా ఆడుతూ పాడుతూ గడిపారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సమచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పిల్ల ఏనుగును పరిశీలించి వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం ఆ ఏనుగు పిల్లను అడవిలోకి విడిచిపెట్టారు.
Last Updated : Sep 14, 2022, 11:36 AM IST