ఆమె అంత్యక్రియల కోసం బంధువుల సాహసం.. ప్రాణాలు ఫణంగా పెట్టి వరదలో... - karnataka flood news
🎬 Watch Now: Feature Video
Funeral in flood video: మహిళ అంత్యక్రియల కోసం భారీ సాహసం చేశారు ఆమె బంధువులు. భుజం లోతున్న వరద నీటి మధ్య మృతదేహాన్ని ఊరేగిస్తూ అంతిమ యాత్ర నిర్వహించారు. కర్ణాటక మండ్య జిల్లా శ్రీరంగపట్న మండలం మహదేవపురలో జరిగిందీ ఘటన. స్థానికంగా ఉండే కేఆర్ఎస్ రిజర్వాయర్ నుంచి ఒక్కసారిగా లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. చుట్టు పక్కల ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. శ్మశానానికి వెళ్లే దారి లేదు. సుమలోచన అనే మహిళ ఆదివారం సాయంత్రం మరణించగా.. సోమవారం ఆమె అంత్యక్రియల కోసం ఇలా అవస్థలు పడ్డారు బంధువులు.