పెళ్లి సమయంలో వరుడు పరార్.. వెనకే పరిగెత్తిన వధువు.. చివరకు పోలీసుల జోక్యంతో.. - నవాదా వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
బిహార్‌లోని నవాదా నడిరోడ్డుపై సుమారు గంటపాటు హైడ్రామా నడిచింది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి నవాదా జిల్లా కోర్టుకు వెళ్లింది ఓ జంట. ఆ సమయంలో పేపర్‌పై సంతకం పెట్టమని వరుడికి లాయర్ చెప్పగా.. ఒక్కసారిగా అతడు పెన్ను విసిరి కోర్టు నుంచి పారిపోయాడు. దీంతో అతడ్ని పట్టుకోవడానికి వధువు పరిగెత్తింది. అయితే వీరిద్దర్ని చూసిన పోలీసులు జోక్యం చేసుకున్నారు. వరుడ్ని పట్టుకుని స్థానికంగా ఉన్న ఆలయంలో వివాహం జరిపించారు. మూడు నెలల క్రితమే వారిద్దరికి వివాహ సంబంధం కుదిరిందని, పల్సర్ బైక్, 50 వేల రూపాయల నగదు కట్నంగా ఇచ్చామని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. మరి పెళ్లి సమయంలో వరుడు ఎందుకు ఇలా చేశాడో తెలియదని అన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Last Updated : Sep 1, 2022, 10:15 PM IST