డ్యాన్స్ చేస్తూ గుర్రంపై నుంచి పడిన వరుడు.. స్ట్రెచర్‌పైనే పెళ్లి - నాగ్‌పుర్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Groom Fell From Horse: సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు కారులో లేదా ఏదైనా వాహనంలో కల్యాణమండపానికి చేరుకుంటాడు. మహారాష్ట్ర నాగ్‌పుర్ జిల్లాకు చెందిన ఓ వరుడు మాత్రం గుర్రంపై రావాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.
అయితే.. కల్యాణ వేదిక సమీపస్తున్న సమయంలో మంచి డీజే పాట విని ఊపు ఆపుకోలేక గుర్రంపైనే డ్యాన్స్ చేశాడు. దీంతో వెంటనే ఆ గుర్రం హడలెత్తి వరుడిని కిందపడేసింది.పెళ్లికొడుకు కుడి కాలు విరిగింది. గుర్రంమీద మండపానికి వెళ్లాల్సిన యువకుడు.. స్ట్రెచర్‌పై చేరుకున్నాడు. అయితే ఇరు కుటుంబాల పెద్దలు వివాహాన్ని వాయిదా వేయకుండా.. యువకుడిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి పెళ్లితంతు జరిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.