ఖతర్నక్ కలెక్షన్లతో క్వాయిష్ వస్త్రాభరణాల ప్రదర్శన - Quaish
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన క్వాయిష్ వస్త్రాభరణాల ప్రదర్శనను వర్ధమాన సినీ కథానాయిక కృతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ స్టాల్స్‌ను సందర్శిస్తూ.. వస్త్ర ప్రియులతో సందడి చేశారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని మూడురోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 70 ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన ఉత్పత్తులను నగరంలోని వస్త్ర ప్రేమికులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.