Inter Board: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం... ఆన్లైన్లో హాల్‌టికెట్లు - తెలంగాణ ఇంటర్ పరీక్షల తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
తెలంగాణలో ఈనెల 6నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పెడితే విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని పరీక్ష రాయవచ్చని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. హాల్‌టికెట్ ఇచ్చేందుకు విద్యార్థులను ఇబ్బందిపెట్టిన కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9లక్షల మంది విద్యార్థుల కోసం 1,443 పరీక్షా కేంద్రాలు, 25వేల మంది ఇన్విజిలేటర్లను సిద్ధం చేశామంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Last Updated : May 2, 2022, 10:17 PM IST