ETV Bharat / state

ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త - అదనపు ఛార్జీలు లేకుండానే సంక్రాంతికి ప్రత్యేక బస్సులు - SANKRANTI FESTIVAL SPECIAL BUSES

సంక్రాంతి పండక్కి ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్​ఆర్టీసీ - హైదరాబాద్​ టూ ఏపీ మధ్య ప్రత్యేక బస్సులు - జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో

Sankranti Festival 2025
Sankranti Festival 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2024, 2:30 PM IST

Updated : Dec 28, 2024, 3:04 PM IST

Sankranti Festival 2025 : సంక్రాంతి పండగ అంటే తెలుగు లోగిళ్లలో స్వచ్ఛమైన పల్లెటూరి పండగ. ఈ పెద్దల పండక్కి దేశ నలుమూల ఎక్కడున్న సరే జనాలు సొంతూళ్లలో వచ్చి వాలిపోతుంటారు. అందరిని ఒక దగ్గరకి చేర్చుతూ, కుటుంబాలను కలసిమెలసిగా ఉల్లాసంగా ఉంచుతుంది ఈ సంక్రాంతి. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు సొంతూరికి వెళతామా అని ఎదురు చూసేవాళ్లు ఉన్నారు. ముఖ్యంగా సంక్రాంతికి హైదరాబాద్​ నుంచి ఏపీకే ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్​ ఖాళీ అవుతుందంటే నమ్మగలరా? సంక్రాంతి పండగను ఇంటిళ్లవాది ఘనంగా చేసుకోవడానికి ఏపీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండక్కి 2,400 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్న వెల్లడించింది.

సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటినుంచే చాలా మంది ఆన్​లైన్​లో టికెట్లను బుక్​ చేసుకుంటున్నారు. అందులోనూ హైదరాబాద్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కి సంక్రాంతి పండక్కే లక్షల మంది తరలివెళతారు. అలాంటి వారి కోసం ఏపీఎస్​ఆర్టీసీ చక్కనైన శుభవార్త చెప్పింది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కు వెళ్లే వారి కోసం ఏకంగా 2,400 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్​ఆర్టీసీ స్పష్టం చేసింది.

పండక్కి రెగ్యులర్​ ఛార్జీలే ఉంటాయి : హైదరాబాద్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కు నిత్యం రెగ్యులర్​ సర్వీసులు తిరుగుతాయి. ఇప్పుడు 2,400 ప్రత్యేక బస్సులను వాటికి అదనంగా నడుపుతామని ఏపీఎస్​ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులకు అదనపు ఛార్జీలు ఏవీ ఉండవని రెగ్యులర్​ ఛార్జీలే ఉంటాయని చెప్పింది. హైదరాబాద్​లోని ఎంజీబీఎస్​లో రద్దీని తగ్గించేందుకు జనవరి 10 నుంచి 12 వరకు కొన్ని మార్పులు చేశామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, మాచర్ల, ఒంగోలు వైపు వెళ్లే రెగ్యులర్​, స్పెషల్​ బస్సులను ఎంజీబీఎస్​కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్​ గౌలిగూడ నడిపించనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్​ఆర్టీసీ కోరింది. అలాగే ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పొగమంచు ఉన్నప్పుడు ప్రయాణం చేయకపోవడమే మంచిదని చెప్పింది.

ధను సంక్రాంతి రోజు ఇలా పూజ చేస్తే చాలు- ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఖాయం!

సంక్రాంతికి ఊరెళ్లాలా? - అయ్యో!! టికెట్లు లేవండి బాబు - SANKRANTI TRAIN TICKETS ISSUE

Last Updated : Dec 28, 2024, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.