ప్రతిధ్వని: జల సంక్షోభం.. భావితరాలపై ప్రభావం - ఈరోజు ప్రతిధ్వని చర్చా
🎬 Watch Now: Feature Video
ప్రపంచవ్యాప్తంగా జలసంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ భూమండలం పైనే అత్యధికంగా జలాలను వినియోగిస్తున్న భారతదేశంలో అరవై కోట్ల మంది నీటి కొరత వల్ల తల్లడిల్లుతున్నారు. జీవనదులు ఉప్పొంగే విశాలదేశం అపారమైన జలరాశులతో అలరారుతున్నా... వాటిని సకాలంలో ఒడిసిపట్టుకునే నేర్పు కొరవడింది. ఫలితంగా గుక్కెడు నీటికోసం మైళ్ల కొద్దీ నడిచే దుస్థితిని చూస్తున్నాం. ఒకవైపు పోటెత్తే వరదలు... ఇంకోవైపు నీటికోసం అంగలార్చే పరిస్థితి. నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా... నీటి సంరక్షణకు తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.