PRATHIDHWANI: ఆర్బీఐ ద్రవ్యోల్బణం అంచనాలు లక్ష్యాన్ని చేరుకుంటాయా?

🎬 Watch Now: Feature Video

thumbnail
PRATHIDHWANI: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటును మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచేసింది. దీంతో కొవిడ్‌ సంక్షోభం తర్వాత వరుసగా మూడోసారి రెపో రేటు పెంచినట్లైంది. రెపో పెంపునకు అనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే దిశగా కదులుతున్నాయి. ఈ మేరకు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన, వ్యవసాయ రుణాలపై వడ్డీల భారం పెరగనుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మాంధ్యం పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే వడ్డీ రేట్లు పెంచామని ఆర్బీఐ ప్రకటించింది. అయితే... ఈ పెంపుదలతో అన్నిరకాల వస్తువులు, సేవల ధరలు పెరిగిపోతాయని, ప్రజలపై ఆర్థిక భారాలు మరింతగా పెరుగుతాయని ఆర్థికవేత్తలంటున్నారు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల చోటుచేసుకునే పరిణామాలపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.