Prathidwani: ప్రధానమంత్రిగా మోదీ ఎనిమిదేళ్ల పాలన ఎలా సాగింది? - etv bharat debate on pm modi ruling
🎬 Watch Now: Feature Video

Prathidwani: భారత్కి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పదవీ బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తయింది. వరుసగా రెండు సార్లు ఎన్డీఏ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న మోదీ... తన పరిపాలనలో నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, రైతుల ఆందోళనల వంటి తీవ్రమైన ఉద్యమాలనూ చవిచూశారు. ఈ ఎనిమిదేళ్లలో అంతర్జాతీయ సంబంధాల్లో భారత్ క్రియాశీల పాత్ర పెరిగింది. అదే సమయంలో దేశంలో రాజ్యాంగ బద్ధ సంస్ధలు నిర్వీర్యం అవుతున్నాయన్న విమర్శలూ పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పాలన ఎలా సాగింది? ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలేంటి? చేరుకున్న మైలురాళ్లు ఏవి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.