prathidhwani: ఒకటే నోటిఫికేషన్ ద్వారా నియామకాల భర్తీ.. ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? - TS PRATHIDWANI
🎬 Watch Now: Feature Video
prathidhwani: విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసింది. యూనివర్సిటీల్లో బోధనా, బోధనేతర సిబ్బంది నియామకం ఈ కామన్ బోర్డు ద్వారానే జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే చాలాకాలంగా పెండింగ్లో ఉన్న నియామక ప్రక్రియకు సంబంధించిన కీలక అడుగు పడిందని ఓవైపు చర్చ జరుగుతుండగా.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే గతంలో ఉన్న విధానంలో ఉన్న లోపాలేంటి..? కొత్త నిర్ణయంతో ప్రభుత్వం ఎందుకు ముందుకొచ్చింది..? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.