ఈటీవీ సిల్వర్ జూబ్లీ... రాజమౌళి శుభాకాంక్షలు - ఈటీవీ సిల్వర్ జూబ్లీ
🎬 Watch Now: Feature Video
ఈటీవీ 25వ వార్షికోత్సవం సందర్భంగా దర్శకుడు రాజమౌళి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీతో తనకు అవినాభావ సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దర్శకుడిగా తన పేరు మొట్టమొదట చూసుకుంది ఈటీవీలోనే అని రాజమౌళి అన్నారు. శాంతినివాసం సీరియల్ ద్వారా తన పేరు తొలిసారి ఈటీవీలోని చూసుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఈటీవీలో ఎప్పుడూ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తారన్న ఆయన.. ఏదైనా వార్త వస్తే అది నిజమో కాదో తెలియాలంటే ఈటీవీనే చూస్తారని పేర్కొన్నారు. ప్రజలందరిలోనూ ఇదే భావన ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా పద్ధతిగా పనిచేస్తేనే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతోందని రాజమౌళి అన్నారు. అటువంటి నమ్మకాన్ని ఏర్పరుచుకుని ఈటీవీ నెట్‌వర్క్ 25 ఏళ్లు పూర్తిచేసుకుందన్నారు. ఇంకా ఎన్నో ఏళ్లు ఇలానే ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని కోరుకున్నారు.