సరికొత్త స్టైల్లో పెళ్లి మండపానికి వధువు.. వరుడు షాక్.. వీడియో వైరల్! - betul news
🎬 Watch Now: Feature Video
Betul Bride Drive Tractor: కాలం మారుతోంది. ప్రతి విషయంలోనూ కొత్తదనం కోరుకుంటోంది యువత. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో వధూవరులు.. విచిత్ర వేషధారణలు, అదిరిపోయే ఎంట్రీలతో ఆకట్టుకోవడం ఇటీవల ఎక్కువైంది. మధ్యప్రదేశ్లోని బైతూల్లోనూ అచ్చం ఇలాంటిదే జరిగింది. పెళ్లి మండపానికి ట్రాక్టర్ నడుపుకుంటూ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది వధువు. దీంతో వరుడు సహా అతడి కుటుంబం, స్థానికులు షాకయ్యారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఖాయీకేడాలోని జావ్రా గ్రామానికి చెందిన వాసు కవడ్కర్తో.. ముల్తాయీకి చెందిన భారతీ తాగడేకు గురువారం రాత్రి వివాహం జరిగింది. అయితే పెళ్లిలో.. డోలీ, కారులో ఎంట్రీ ఇచ్చే సంప్రదాయం పాతబడిపోయిందని, అందుకే తాను ఈ కొత్త స్టైల్లో వచ్చినట్లు వివరించింది భారతి.