జర్మనీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురం.. ఉట్టిపడిన తెలుగందం - జర్మనీలో బతుకమ్మ వేడుకలు
🎬 Watch Now: Feature Video
Bathukamma Celebrations in Germany:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు ఎల్లలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. జర్మనీలోని మునిచ్ నగరంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో 200 మందికి పైగా ఎన్ఆర్ఐ మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది బతుకమ్మ ఆటపాటలతో ఆడిపాడారు. తాము ప్రతి సంవత్సరం సంప్రదాయ తెలుగు పండగలైన బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, ఇతర తెలుగు పండగలన్నీ జరుపుకోవడమే కాకుండా.. తమ పిల్లలకు కూడా భారతీయ సంస్కృతి, పండగల విశిష్టత పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.