రాశిఫలం: కుంభ - 2020-2021 రాశి ఫలాలు
🎬 Watch Now: Feature Video
ఈ రాశివారికి ఈ ఏడాది మంచి ఫలితాలు ఉన్నాయి. ఎవరిమీద అయితే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారో వారు పెద్దగా ఉపయోగపడరు. ఆత్మీయులు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ మాటతీరుతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. అనుభవంలేని రంగాల్లో కొత్తవారిని నమ్మి వ్యాపారంలోకి దిగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన దానికంటే ముందుగానే వస్తాయి. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడండి. రుణాల విషయంలో మీపై అపనిందలు వచ్చే అవకాశం ఉంది. విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయించుకోండి. దొంగతనాలకు అవకాశం ఉంది. వివాహాదిశుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ పదవి ప్రాప్తి ఉంది.
Last Updated : Mar 25, 2020, 11:49 AM IST