'మంత్రి కాగానే అన్నీ మర్చిపోతారా? జబర్దస్త్ గురించి అప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలేనా?' - ఈటీవీ దసరా వేడుకలు
🎬 Watch Now: Feature Video

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులను బాగా అలరించారు సీనియర్ నటి రోజా. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకున్నారు. బుల్లితెర పాపులర్ షో అయిన జబర్దస్త్‌లోనూ జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్క్రేజ్ను సంపాదించుకుని రాజకీయాల్లో మరిన్ని బాధ్యతలు పెరగడం వల్ల షో నుంచి తప్పుకున్నారు. ఇటీవలే దసరా పండగ సందర్భంగా ఈటీవీ ఛానల్లో ప్రసారమైన ఓ ప్రత్యేక షోకు వచ్చిన ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఆ సమయంలో గతేడాది దసరా వేడుకల్లో రోజా.. జబర్దస్త్ గురించి మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియో అయ్యాక కమెడియన్ నూకరాజు..'జబర్దస్త్ అంటే ఇష్టం.. అంతా నా ఫ్యామిలీ అని అప్పుడు మీరు(రోజా)చెప్పారు. మంత్రి అయ్యాక జబర్దస్త్‌ను వదిలి వెళ్లిపోయారు. అయితే మీరు జబర్దస్త్ గురించి చెప్పింది నిజం అనుకోవాలా.. మంత్రి అవ్వగానే వదిలి వెళ్లిపోవడం నిజం అనుకోవాలా?' అంటూ రోజాను అడిగారు. వెంటనే రోజా.. 'నన్ను పిలిచింది అవమానించడానికా?' అంటూ పూలదండ విసిరి కన్నీరు పెట్టుకుని వెళ్లిపోయారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.
Last Updated : Oct 6, 2022, 2:22 PM IST