పాతబస్తీలో ఘనంగా ఘటాల ఊరేగింపు - హైదరాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
ఆషాడ మాస బోనాల జాతర ఉత్సవాలు హైదరాబాద్ పాతబస్తీలో అంగరంగ వైభవంగా జరిగింది. అక్కన మాదన్న మహంకాళి దేవాలయం నుంచి ఏనుగు అంబారీపై ఘటం ఉరేగింపు ప్రారంభమైంది. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు, బాజా భజంత్రీల మధ్య ఘనంగా అమ్మవారి ఘటాలు ముందుకు సాగాయి. వేడుకల కోసం నగర సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకగా సాగిన ఉత్సవం మదీనా మీదుగా సాగి నయాపూల్ వద్ద ముగిసింది.