కత్తి విన్యాసాలతో గిన్నిస్ రికార్డ్, ఒకే చోట వేలాది మంది కలిసి - భూచార మోరీ మైదాన్ యుద్ధం గుర్తుగా కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
ఐదు వేల మంది రాజ్‌పుత్ యువకులు కత్తులతో విన్యాసాలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ అరుదైన సంఘటన గుజరాత్‌లోని జామ్ నగర్లో శుక్రవారం జరిగింది. చరిత్రాత్మక 'భుచార్ మోరీ మైదాన్' యుద్ధంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం.. అఖిల గుజరాత్ రాజ్‌పుత్ యువ సంఘ్‌తోపాటు షహీద్ స్మారక ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 17 జిల్లాలకు చెందిన యువకులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హకుభా జడేజాతో పాటు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్రమంత్రి కీర్తి సింగ్ వాఘేలా హాజరయ్యారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పత్రాన్ని నిర్వాహకులకు అందించారు. 500 ఏళ్ల క్రితం జామ్ నగర్ జిల్లాలోని ధ్రోల్ నగర్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో భుచార్ మోరీ మైదానంలో అత్యంత భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వేల మంది ప్రజలు తమ ప్రాణాలను అర్పించారు.